కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడి
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీలో మరో ఏడాదిలోగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మధ్య పొత్తు కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు.
కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పారీ్టలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి పారీ్టలు తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టంచేశారు. అవగాహన కుదిరిన చోట కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment