‘బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి’ | Mallikarjun Kharge Slams BJP In Mumbai | Sakshi
Sakshi News home page

‘బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి’

Published Thu, Oct 24 2019 4:17 PM | Last Updated on Thu, Oct 24 2019 4:51 PM

Mallikarjun Kharge Slams BJP In Mumbai - Sakshi

ముంబై: హరియాణా ఎన్నికల ఫలితాల సరళిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించాడు. ప్రజల కష్టాలను బీజేపీ ఏ మాత్రం​ పటించుకోలేదని ఆరోపించాడు. అధికారం కోసం బీజేపీ ఎన్ని కుట్రలైనా పన్నుతుందని, వాటిని తిపికొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తామని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని అడ్డుకుంటామని అన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. అయితే, 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అఖండ విజయాన్ని సాధించిన విషయం విధితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement