
వారసత్వ రాజకీయాలు వద్దు: మోదీ
హిస్సార్: హర్యానాలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'కుటుంబ పాలన' నుంచి హర్యానాకు విముక్తి కల్పించాల్సిన అవసరముందన్నారు. హిస్సార్ లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని మోదీ విమర్శించారు. బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఆయన కోరారు.