హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారంలో చివరి రోజు సైతం (గురువారం) ప్రధాని నరేందర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, బంధుప్రీతి కులతత్వం, మతతత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ధ్వజమెత్తారు.
గత కొన్ని రోజులుగా తాను హర్యానా అంతటా పర్యటించానని, ప్రజలు ఉత్సాహంగా బీజేపీని ముచ్చటగా మూడోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించే పరిస్థితులు లేవని విమర్శించారు. 201 నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందన్న మోదీ.. ఈ పదేళ్లలో హర్యానా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేసిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు
ఇక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను మోదీ ఎత్తిచూపుతూ.. ‘హర్యానా ప్రజలకు కాంగ్రెస్ అంటే అవినీతి, కులతత్వం, మతతత్వం, బంధుప్రీతికి హామీ అని తెలుసు. తండ్రీకొడుకుల రాజకీయాల ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే. నేడు హిమాచల్ నుంచి కర్ణాటక వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలు ప్రజలను నాశనం చేస్తున్నాయి. అందుకే హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదు. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీ రాష్ట్రంలో ఎప్పటికీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు.
ఈ రోజు ప్రపంచం మొత్తం ఎంతో ఆశతో, అంచనాలతో భారత్ వైపే దిస్తోంద. అలాంటి పరిస్థితుల్లో హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని(బీజేపీ ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. కాంగ్రెస్ భారతదేశాన్ని ఎప్పటికీ బలోపేతం చేయలేదు. హర్యానా ప్రజలు మరోసారి తమ ఆశీర్వాదాలను బీజేపీకి అందించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో బ్రేక్‌లు పడింది. అటు అధికార బబీజేపీతో సహా కాంగ్రెస్, ఆప్, ఇతర స్థానిక పార్టీలు హోరాహోరీగా సభలు, సమావేశాలు నిర్వహించి విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డాయి. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment