బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
గోండియా/న్యూఢిల్లీ: మన దేశ రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని తాను గ్యారంటీగా చెప్పగలనని అన్నారు. ఒకవేళ నిజంగా ఆయన చదివి ఉంటే రాజ్యాంగంలో రాసి ఉన్న అంశాలను తప్పనిసరిగా గౌరవించేవారని పేర్కొన్నారు.
ఐక్యత, సమానత్వం, అన్ని మతాల పట్ల గౌరవాన్ని రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. విద్వేషం, అణచివేత, అసమానత్వాన్ని వ్యతిరేకిస్తోందని తెలిపారు. మంగళవారం మహారాష్ట్రలోని గోండియాలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. పదేళ్లలో ఎంతమంది రైతుల రుణాలను మాఫీ చేశారో ప్రధానిని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలి్చవేయడం రాజ్యాంగబద్ధమేనా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని బలహీనపర్చడం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు.
అత్యున్నత పర్యాటక కేంద్రంగా వయనాడ్
కేరళలోని వయనాడ్‌ను అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తాను, తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా సంకలి్పంచామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో విడుదల చేశారు. సోమవారం ప్రియాంకతో కలిసి వయనాడ్ అడ్వెంచర్ పార్కును సందర్శించిన దృశ్యాలను పంచుకున్నారు. ఇటీవల ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ వయనాడ్ ప్రజల్లో ఆత్మస్థైర్యం తగ్గిపోలేదని, వారిని చూసి స్ఫూర్తిని పొందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా ప్రియాంక పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక బుధవారం జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment