చండీగఢ్: హరియాణలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్–మేలో, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. హరియాణాలోని జింద్‌లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ పై నిర్ణయం ప్రకటించారు.
‘హరియాణ ప్రజలిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రమే నమ్ముతున్నారు. పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మార్పును కోరుతున్నారు. ఆప్‌కే అధికార మివ్వాలని భావిస్తున్నారు’అని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన పార్టీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఆయా పార్టీల నేతలు తమ జేబులనే నింపుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment