alone
-
వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా?
రోజూ కనీసం అర్థగంట సేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఖర్చులేనిది. అనువైంది కూడా క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చు. సాధారణంగా, గుంపులుగా, జంటలుగా, స్నేహితులతో వాకింగ్ చేస్తూ ఉండటం, పార్కింగ్ల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం. అయితే వాకింగ్ ఎలా చేయాలి. ఎపుడు చేయాలి? ఒంటరిగాచేయాలా? లేక తోడు ఉంటే మంచిదా? ఇలాంటి విషయాల గురించి ఎపుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి!ఏ సమయంలో చేయాలి? వ్యాయామం ఎపుడు చేసినా దాని ప్రయోజనాలు దానికుంటాయి. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిదని చెబుతారు. ఉదయం ట్రాఫిక్ బెడద ఉండదు, కాలుష్యం తక్కువ. వీటిన్నింటికంటే ఉదయం వాతావరణం ప్రశాంగంగా ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలు, శరీరానికి, మనసుకు ఉత్తేజానిస్తాయి.రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున రోజులో గంట చేసినట్టువుతుంది. వాకింగ్‌ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. అటవాటైన కొద్దీ క్రమంగా వేగం పెంచాలి. షుగర్ పేషెంట్లే, గుండె జబ్బులున్నవారు ఏదైనా కాస్త తిన్నాక చేయడం మంచిది. వాకింగ్ కోసం సౌకర్యవంతంగా ఉండే షూస్ ధరించడం, పార్క్‌ల్లో కాకుండా ఆరుబయట నడిచే వారు కుక్కల నుంచి తప్పించుకునేందుకు చేతి కర్ర ఉంటే మంచిది.ఒంటరిగా చేయాలా? తోడు ఉండాలా?ఒంటరిగా నడవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది, నడకచురుగ్గా ఉంటుందిమాట్లాడుకుంటూ నడిస్తే తొందరంగా ఆయాసం వస్తుంది. ఏకాగ్రత ఉండదు. ఏదైనా వ్యాయామంద్వారా ప్రయోజనం పొందాలంటే కాన్సెంట్రేషన్ ముఖ్యం. ఇద్దరు లేదా ముగ్గురుఉంటే ఇది సాధ్యపడకపోవచ్చు. సరైన వేగంతో నడిస్తేనే ఫలితం బావుంటుంది. కనుక ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఒంటరిగా నడవడం ఉత్తమ మార్గం.అయితే భర్త లేదా భార్యతోనో, స్నేహితులతోనో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. ఎలా అంటే..పార్టనర్ ఉంటే నడక బోర్ కొట్టదు. ఉత్సాహంగా ఉంటుంది. జంటగా అయితే మీ వేగాన్ని అందుకోగల వారైతే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. పోటీ తత్వం ఉంటుంది.వృద్ధులు తమతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు మరింత సురక్షితంగా భావిస్తారు. పెద్దవాళ్లు గుంపులుగా నడవడం ఖచ్చితంగా సురక్షితం.వాకింగ్ ఎపుడు, ఎలా అనేది మనకున్న వెసులుబాటు, మనం అనుకున్న లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో చేసినపుడు మాత్రమే చక్కటి ఫలితం లభిస్తుంది.ఇదీ చదవండి: గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో! -
హర్యానా ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఒంటరి పోరు?
యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
హరియాణా అసెంబ్లీకి ఒంటరిగానే ఆప్
చండీగఢ్: హరియాణలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్–మేలో, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. హరియాణాలోని జింద్‌లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ పై నిర్ణయం ప్రకటించారు. ‘హరియాణ ప్రజలిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రమే నమ్ముతున్నారు. పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మార్పును కోరుతున్నారు. ఆప్కే అధికార మివ్వాలని భావిస్తున్నారు’అని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన పార్టీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఆయా పార్టీల నేతలు తమ జేబులనే నింపుకున్నారని ఆరోపించారు. -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 17 స్థానాలు ఇవే... ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. -
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
Mohanlal: వందల కోట్ల స్టార్ హీరోకి దారుణ పరిస్థితి!
మాలీవుడ్ స్టార్ హీరోల్లో మోహన్‌లాల్ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్ నటించిన చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్‌కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్‌లో మోహన్‌లాల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా దాటడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మోహన్‌లాల్ మాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్ సినిమాతో మాలీవుడ్‌కు రూ.100 కోట్లు, లూసీఫర్ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్‌లాల్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్ (Alone) సినిమాకు అయితే తొలి రోజే గెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్ ఫ్యూచర్‌పై మాలీవుడ్‌లో టెన్షన్ మొదలైంది. కానీ ఈ బిగ్‌స్టార్ త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ చేతిలో లూసీఫర్ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
26 ఏళ్లుగా అడవిలో ఒంటరి జీవనం.. అంతరించిపోయిన అరుదైన తెగ
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని ఆదివాసీ తెగకి చెందిన ఒక ఒంటరి మనిషి తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోనే ఒంటరి వ్యక్తిగా పిలిచే ఆ మనిషి ఇటీవల మరణించినట్టు బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అతని పేరేంటో తెలీదు. బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధాలు లేవు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుంది. గత 26 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అడవి జంతువుల్ని బంధించడంతో పాటు ఆత్మ రక్షణ కోసం అడవిలో ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ వెళతాడని అతనిని ‘‘మ్యాన్ ఆఫ్ ది హోల్’’ అని పిలుస్తారు. దూరం నుంచే అతని బాగోగుల్ని పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల సంస్థ అధికారికి ఆగస్టు 23న ఒక గుడిసెలో అతని మృతదేహం కనిపించింది. అతని మీద దాడి చేసి ప్రాణాలు తీసినట్టుగా ఆధారాలేవీ కనిపించలేదు. అప్పటికే ఆ వ్యక్తి మరణించి 40 నుంచి 50 రోజులై ఉంటుందని అతని మృతదేహం పడి ఉన్న తీరుని బట్టి అంచనా వేశారు. అతని మృతదేహంపైన రంగు రంగుల పక్షి ఈకలు ఉన్నాయి. దీంతో అతను తన మరణాన్ని ముందుగానే ఊహించి ఈకలు కప్పుకొని ఉంటాడని ఆదివాసీ నిపుణుడు మార్కెల్ డోస్ శాంటో తెలిపారు. రోండానియా రాష్ట్రంలోని టనూరు ఆదివాసీ ప్రాంతంలో నివసించే ఒకానొక ఆదివాసీ తెగలో ఇతను చివరి వాడు కావడంతో మానవజాతిలో ఒక తెగ అంతరించినట్టయింది. నాలుగేళ్ల క్రితం అతను బ్రెజిల్ అధికారుల కెమెరాలకు చిక్కాడు. పదునైన ఆయుధంతో చెట్లు నరికే దృశ్యాలు అందులో ఉన్నాయి. ఆ వ్యక్తి అధికారులకి కనిపించడం అదే చివరిసారి. టనూరులో ఆదివాసీ తెగపై కొందరు భూ ఆక్రమణదారులు 1970 నుంచి దాడులు చేస్తూ ఈ తెగకి చెందిన వారిని చాలా మందిని బలి తీసుకున్నారని ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఆ తెగలో మిగిలిన ఆరుగురిని 1995లో అక్రమ గనుల తవ్వకదారులు దాడులు చేసి చంపేశారు. అతనొక్కడే ప్రాణాలతో మిగిలిపోవడంతో ఒంటరివాడైపోయాడు. అప్పట్నుంచి అతని రక్షణని ఎప్పటికప్పుడు బ్రెజిల్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఈ మిస్టరీ మ్యాన్ మరణించడంతో ఆ తెగకు చెందిన వివరాలన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. -
మారణహోమానికి ఆనవాలు.. పాతికేళ్లపైనే ఒంటరిగా బతికి..
నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు రానీయకుండా ‘ఒంటరి’ జీవనం గడిపి.. చివరకు అడవితల్లి ఒడిలో దిక్కుమొక్కులేకుండా ప్రాణం విడిచాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన.. అదే సమయంలో ఆలోచింపజేసిన ది మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు. బ్రెజిల్ పశ్చిమ ప్రాంతం రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా దాదాపు పాతికేళ్లకు పైనే(వీడియో, ఫొటో రికార్డింగ్‌ల ఆధారంగా) ఈ ఒంటరి మనిషి జీవనం కొనసాగింది. పేరు, ఏ తెగకు చెందిన వ్యక్తి అనే విషయాలపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ, 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. చాలా ఆలస్యంగా 2018లో ఆ వీడియోను బయటి ప్రపంచానికి విడుదల చేశారు. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. చాలా కాలం అతన్ని వెంబడించాక.. చివరకు అతని ముఖం కెమెరాకు చిక్కింది. కానీ.. దగ్గరికి వెళ్తే.. దాడి ఎవరైనా అతన్ని చూసినా.. దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే.. దాడి చేసేవాడు. బాణాలు, ఈటెలు విసరడం లేదంటే.. అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు. అయితే.. చంపేవాడు మాత్రం కాదు. తనకు దూరంగా ఉండాలని హెచ్చరించడమే అతని ఉద్దేశంగా ఉండేది. 1970 నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదివాసీ తెగలకు చెందిన వ్యక్తనే అభిప్రాయం మాత్రం ఇన్నాళ్లూ నడుస్తూ వచ్చింది. ఆ అభిప్రాయం ఏర్పడడానికి ప్రధాన కారణం.. అతని జీవన శైలి. గొతులు తవ్వి వాటిలో దాక్కోవడం, వాటి ద్వారానే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం చేస్తూ వచ్చాడు కాబట్టి. అంతేకాదు.. అక్కడొక గుడిసె వేసుకుని కొన్నాళ్లపాటు జీవించాడతను. 2018లో ప్రభుత్వం అతన్ని చిత్రీకరించిన తర్వాత.. అది గమనించి అక్కడి నుంచి మకాం మార్చాడతను. విషాదం ఉండొచ్చు..! పేరు, ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసీకి.. మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే పేరు మాత్రం ముద్రపడిపోయింది. కానీ, మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం.. వాళ్లు అతని తెగను బలిగొనడమే!. బ్రెజిల్లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు 30కిపైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం ఒక అంచానికి వచ్చింది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనేది మరో అంచనా. ఆహార సాయం కూడా వద్దనే.. తనారు ప్రాంతంలో 1970 నుంచి ఈ దండకారణ్యంలో భూ ఆక్రమణలతో మారణ హోమం కొనసాగింది. అమెజాన్ అడవులనే నమ్ముకుని బతికిన ఆదివాసీ జాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను కావొచ్చని అధికారులు అంటున్నారు. ఆహార సాయం అందించినా కూడా.. ఎవరినీ నమ్మేవాడు కాదతను. వాటిని చీధరించుకుని దూరంగా వెళ్లిపోవడం అందుకు మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు సర్వైవల్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ డైరెక్టర్ ఫియానా వాట్సన్. 80వ దశకంలో ఆదివాసీలకు సాయం పేరిట చక్కెర, ఇతర దినుసుల్లో ఎలుకల మందు కలిపి ఘోరంగా హత్యలు చేసుకుంటూ వెళ్లారని ఆనాటి మారణహోమాన్ని గుర్తు చేస్తున్నారామె. An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO — philip lewis (@Phil_Lewis_) August 28, 2022 అమెజాన్ పట్ల నిర్లక్ష్యం, ఆదివాసీల పట్ల చిన్నచూపుతో అధ్యక్షుడు బోల్సోనారో.. ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాడు. కానీ, ఆ అడవినే నమ్ముకున్న తెగలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వినాశనాన్ని అడ్డుకుని తీరతామంటూ శపథాలు చేస్తున్నాయి. అలా పోరాటంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ కన్నుమూసి.. కూలిపోయిన స్థితిలో ఓ పాకలో ఆగస్టు 23న కనిపించాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరావాల్సి ఉన్నప్పటికీ.. నాగరికత నేర్చిన మనిషి తన మారణహోమం మాత్రం ఎట్టకేలకు పూర్తి అయ్యిందని ఫియానా బాధతో చెప్తోంది. ఇదీ చదవండి: మేకప్ లేకుండా అందాలపోటీలో ఆమె.. చరిత్రలో తొలిసారి -
పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వొదిలి వెళ్తున్నారా..?
ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కాపలా ఉండే రోజులు పోయాయి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు.. వేరే ఏవైనా పనులకు వెళ్లాలి. నగరాల్లో అయినా పల్లెల్లో అయినా ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా పిల్లల్ని ఒదిలి వెళ్లక తప్పడం లేదు. గంటలో వచ్చేస్తాం.. రెండు గంటల్లో వచ్చేస్తాం.. అని చెప్పి వెళ్లినా ప్రాణం పీకుతూనే ఉంటుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లలు ఇంట్లో ఉంటే తాతయ్యో అమ్మమ్మో గతంలో చూసుకునేవారు. ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన మేనత్తో చదువుకుంటున్న బాబాయో ఉండేవారు. లేదంటే పక్కింట్లో కూచోబెట్టి వెళ్లేవారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా ఏ ఇంట్లోనూ సాధ్యం కావడం లేదు. ఉదయం లేచి పిల్లలు స్కూలుకు వెళ్లి సాయంత్రం వారు ఇంటికి చేరుకునే సమయానికి తల్లో, తండ్రో ఇంట్లో ఉంటే ఒక సంగతి. లేదా తల్లిదండ్రులు వచ్చేలోగా ఆ ఒకటి రెండు గంటల సమయాన్ని పిల్లలు తాళం తీసుకుని ఒంటరిగా ఉండాల్సి వస్తే వాళ్ల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు పిల్లల సెలవు రోజుల్లో వారు రానవసరం లేని పనులు ఉంటాయి. కార్యాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్దలు సినిమాకు వెళ్లాలనుకుంటే వారికి నచ్చని వాటికి రారు. ఇద్దరు పిల్లలు ఉంటే వారు ఒకరికొకరు తోడుంటే కొంత బెటర్. కాని ఒక్కరే సంతానం ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసులో ఒంటరిగా వదలొచ్చు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అమెరికాలో దీనిపై పరిశోధన చేసిన వాలెంటీర్ల బృందం 12 ఏళ్లు వచ్చాకే పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లొచ్చని, పన్నెండు లోపల వదిలితే వారిని ప్రమాదంలో నెట్టినట్టేనని తేల్చారు. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ‘చట్టప్రకారం నేరం’ అని నిర్ధారించే వరకు కొన్ని పాశ్చాత్య దేశాలు వెళుతున్నాయి. మన దేశంలో ఈ దిశగా ఏ చర్చా లేకపోయినా 12 ఏళ్లలోపు పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలి రెండు మూడు గంటలు వెళ్లడం వారి పట్ల ‘నిర్లక్ష్యం’ వహించడమేనని నిపుణులు అంటున్నారు. గ్యాస్, కరెంట్ ప్లగ్గులు ఇంటి నుంచి పెద్దలు పిల్లల్ని వదిలి వెళ్లేప్పుడు తప్పనిసరిగా గ్యాస్‌ను, అనవసరంగా ఆన్‌లో ఉన్న స్విచ్‌లను (గీజర్/ఐరన్ బాక్స్/మిక్సీ) ఆఫ్ చేసి వెళ్లాలి. వాటి దగ్గరకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాలి. ఒక ఫోన్ ఇంట్లో వదిలి వెళ్లాలి. దానికి స్క్రీన్ లాక్ ఉంటే ఎలా తీసి కాల్ చేయాలో నేర్పించాలి. అంతే కాకుండా అపార్ట్‌వెంట్/ఇరుగు పొరుగులలో నమ్మకమైన మిత్రుని నంబర్ ఏదో చెప్పి అది ఏ పేరుతో ఫోన్లో ఉందో చూపాలి. అర్జెంట్ అనిపిస్తే ఆ ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేయమని చెప్పాలి. తల్లిదండ్రుల నంబర్లు, ఊళ్లోనే ఉన్న దగ్గరి బంధువుల (బాబాయ్/పిన్ని) నంబర్లు మొత్తం నాలుగైదు కంఠతా వచ్చి ఉండేట్టు చూడాలి. ఫ్రిజ్ మీద కూడా ముఖ్యమైన నంబర్లను కాగితం మీద రాసి అంటించి ఉంచవచ్చు. తలుపు ఎవరికి తీయాలి తలుపు ఎవరికి తీయాలి అనేది మరో ముఖ్యమైన సంగతి. అపరిచితులు ఎవరో... స్నేహితులు ఎవరో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అపరిచితులు ఏం చెప్పినా తలుపు తియ్యనే కూడదని నేర్పాలి. పరిచితులు మీరు లేని టైమ్‌లో వస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. వారు మరీ ముఖ్యులైతే పిల్లలకు పరిచయం ఉంటే వారు వచ్చినప్పుడు మాత్రమే తలుపు తీయాలని చెప్పాలి. గ్యాస్/పేపర్ బిల్/ పాల బిల్ వీటి కోసం వచ్చినా తలుపు లోపలి నుంచే మళ్లీ రండి అని చెప్పి పంపించేయడం నేర్పాలి. తలుపు లోపలి నుంచి గడి పెట్టుకోవడం లేదా తలుపు తీసి ఉంచి గ్రిల్‌కు తాళం వేసి పెట్టుకోవడం నేర్పాలి. తాళం ఒక గుర్తుండే చోటులో పెట్టుకోవాలని చెప్పాలి. తాళం వేశాక దానిని ఎక్కడో పడేసి మర్చిపోకుండా ఈ ఏర్పాటు. ముఖ్యం ఎవరికీ అనవసరంగా ఫోన్ చేయకూడదని ఎవరైనా ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పకుండా తర్ఫీదు ఇవ్వాలి. పదిహేనేళ్లు దాటే వరకూ పిల్లల్ని ఒంటరిగా వదిలితే తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రమాదాలను నివారించాలి. ఆహారం, యాక్టివిటీ పిల్లలు ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాళ్లు ఇంట్లో ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందన్న సంకేతం ఇవ్వరాదు. ‘కాసేపు టీవీ చూడు... కాసేపు ఫోన్ చూడు... మిగిలిన టైమ్‌లో ఇదిగో ఈ పుస్తకం చదవాలి, ఈ బొమ్మ గీయాలి, ఈ పజిల్స్ ఫిల్ చేయాలి’... ఇలా టాస్క్ ఇచ్చి వెళ్లాలి. మీరొచ్చే సమయానికి టాస్క్ పూర్తి చేస్తే మెచ్చుకోలు కానుకలు తప్పక ఇవ్వాలి. బయటకు వెళ్లే పని ఆలస్యం అవ్వొచ్చు ఒక్కోసారి. అందుకని వారి కోసం స్నాక్స్ తప్పక పెట్టాలి. ఏదైనా తేలికపాటి టిఫిన్ బాక్స్ పెట్టి ఏది ఎప్పుడు తినాలో చెప్పాలి. పిల్లలు మందులు వేసుకోవాల్సి ఉంటే ఆ మందులు మనమే ఒక దగ్గర పెట్టాలి... అధిక డోసు ప్రమాదం లేకుండా... వేరే మందులు వేసుకోకుండా. నో హెడ్‌ఫోన్స్ పిల్లలు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సినిమా/ కంప్యూటర్/ ఫోన్ చూడటాన్ని ఆ టైమ్‌లో నిషేధించాలి. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని హెడ్‌ఫోన్స్‌లో వింటుంటే బెల్ కొట్టినా ఫోన్ మోగినా వినపడదు. తల్లిదండ్రులు కాల్ చేస్తే రెస్పాన్స్ రాకపోతే అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది. అలాగే తలుపు తీసి పెట్టి పక్కింటికి వెళ్లడం, కారిడార్‌లో ఆడుకోవడం, ఇంటి బయట సైకిల్ తొక్కడం చేయరాదని చెప్పాలి. పెద్దలు ఎంత ముఖ్యమైన పని మీద బయటకెళ్లినా మధ్య మధ్య పిల్లలకు ఫోన్ చేసి వారు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అలాగే వెళ్లే ముందు ఇరుగు పొరుగున ఉన్న నమ్మకమైన వ్యక్తులకు తాము బయటకు వెళుతున్నట్టు తెలియ చేస్తే వారు ఒక కన్ను వేసి పెట్టే వీలుంటుంది. -
11 ఏళ్ల బాలుడు ఒంటరిగా వెయ్యి కి.మీ పయనించాడు! ఎందుకో తెలుసా
11-Year-Old Ukraine Boy Travels: రష్యా ఉక్రెయిన్‌పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. దీంతో వేలాది మంది పొరుగు దేశాలకు పారిపోయి తలదాచుకున్నవారు కొందరు. మరి కొంతమంది బంకర్లలో తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే గత వారం రష్యా దళాలు ఆగ్నేయ ఉక్రెయిన్‌లో జాపోరిజ్జియాను స్వాధీనం చేకున్నారు. అదే నగరానికి చెందిన ఒక ఉక్రెయిన్ కుటుంబం రష్యా దాడి నుంచి తప్పించుకునేందుకు తమ కొడుకుని స్లోవేకియాలోని తమ బంధువుల వద్దకు రైలులో ఒంటరిగా పంపించింది. అంతేకాదు ఆ బాలుడు తన బంధువులను చేరుకునేలా అతని తల్లి చేతిపై ఒక ఫోన్ నెంబర్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, చిన్న కాగితం ముక్క, పాస్‌పోర్ట్ ఇచ్చి పంపించింది. అయితే ఆ బాలుడు ఒంటరిగా సుమారు వెయ్యి కి.మీ పయనించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ మేరకు సరిహద్దులోని అధికారులు ఆ బాలుడు స్లోవేకియాకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఉన్న మడతపెట్టిన కాగితం ముక్కతో రాజధాని బ్రాటిస్లావాలోని అతని బంధువులను సంప్రదించి ఆ బాలుడిని అప్పగించారు. అంతేకాదు ఆ బాలుడి తల్లి అతనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు స్లోవాక్ ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం కూడా పంపింది. ఆ బాలుడు తన చిరునవ్వు, నిర్భయత, ధృఢ సంకల్పంతో అధికారుల మనసులను గెలుచుకున్నాడు. అంతేగాదు స్లోవేకియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆ బాలుడిని "ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్" అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ఆ బాలుడి కుటుంబంలోని ఒక బంధువుకి అనారోగ్యంతో ఉండటంతో అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో వారు తమ కొడుకును ఒంటరిగా స్లోవేకియాకు పంపిచారు. (చదవండి: పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!) -
కోడిని కొనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికపై లైంగికదాడి
సాక్షి,శృంగవరపుకోట రూరల్(విజయనగరం): ఎస్.కోట మండలంలో కోడిని కొనే నెపంతో ఇంట్లో చొరబడిన ఓ దుండగుడు 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి బుధవారం రాత్రి పాల్పడ్డాడు. దీంతో అదే రోజు రాత్రి గ్రామపెద్దలతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి గురువారం తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన రైతు దగ్గర ఓ వ్యక్తి రైతరికం కోసం చేరాడు. భార్య, 10వ తరగతి చదువుతున్న కూతురితో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి కోళ్లను పెంచి అమ్ముతూ ఉంటాడు. అయితే రైతరికం చేస్తున్న వ్యక్తి..కుమార్తెను ఇంటి వద్దనే ఉంచి భార్యతో కలిసి పనిమీద శృంగవరపుకోట పట్టణానికి బుధవారం వచ్చారు. అదే సమయంలో గంట్యాడ మండలం, బోనంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి బేరమాడే పనిలో ఉంటూనే బాలికను మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారిల్లు ఊరికి దూరంగా ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడు అనంతరం పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన ఘోరం చెప్పగా గ్రామపెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసు విషయమై సీఐ సింహాద్రినాయుడితో మాట్లాడగా త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. -
పాపం.. పసిహృదయాలు!
విధి ఆడిన వింతనాటకంలో.. తల్లిదండ్రులు దూరమై ఇద్దరు పిల్లలు వీధినపడిన ఘటన కేవీబీపురం మండలం, తిమ్మసముద్రం గ్రామంలో మంగళవారం కలచివేసింది. గత ఏడాది కరోనా మహమ్మారికి తండ్రి బలవ్వగా, ఇప్పు డు గుండె పోటుతో తల్లి దూరమవ్వడం ఆ చిన్నారులకు తీరని వేదనను మిగిల్చింది. నా అన్న వాళ్లు లేక.. తమ కాళ్లపై తాము నిలబడలేక తల్లడిల్లితున్న ఆ పసిహృదయాలను చూసి పలువురు కంటతడి పెట్టడం కనిపించింది. సాక్షి,చిత్తూరు: మండలంలోని తిమ్మసముద్రం గ్రా మానికి చెందిన ప్రతాప్‌రెడ్డి(48), సుగుణ(44) భా ర్యభర్తలు. వీరికి కుశి్మతా(17), నితీష్ సంతానం. మూడేళ్ల కిందట వరకు కిడ్నీ వ్యాధితో ప్రతాప్‌రెడ్డి వారంవారం డయాలసిస్ చేయించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్‌తో వైద్య ఖర్చులు పోను అంతోఇంతో కూడబెట్టి పిల్లల చదువుకు ఉపయోగించేవాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న వేళ గత ఏడాది కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. కుటుంబ పెద్దను పొట్టబెట్టుకుంది. అప్పటి వరకు లోకం తెలియని ఆ ఇల్లాలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుబాటులో ఉన్న కూలిపనులకు వెళ్లి బిడ్డలకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని పిల్లలకు తండ్రి లేనిలోటు లేకుండా చదివించింది. ఇలాంటి తరుణంలో మంగళవారం సుగుణకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంటివద్దే ప్రాణాలు వదిలింది. పెద్దగా బంధువులు కూడా లేకపోవడంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు. అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక ఆ పసిహృదయాలు తల్లడిల్లిపోయాయి. తల్లి మృతదేహం వద్దే దిగాలుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్థానికులు చేయిచేయి కలిపి వారికి అంతిమయాత్రను కొనసాగించారు. ఇద్దరు పిల్లల చేత తల్లికి తలకొరివి పెట్టించారు. వీధినపడిన పిల్లలను ప్రభుత్వం అక్కున చేర్చుకుని చదివించాలని స్థానికులు కోరుతున్నారు. -
32 ఏళ్లు ఒంటరిగా.. ఆ దీవిలోనే జీవనం.. చివరికి
మనిషి సంఘజీవి సమాజంతో తప్ప ఒంటరిగా బతకలేడు అనే మాటను మనం వినే ఉంటాం. ఇదే మాట ఈ పెద్దాయనకు వర్తించదేమో. ఈ వ్యక్తి ఓ దీవిలో ఏకంగా 32 ఏళ్లు ఒంటరిగా జీవించాడు. అది కూడా ఏ చీకూ చింతలేకుండా ఆనందంగానే కాలం గడిపాడు. తనతో తానే సావాసం చేసుకుంటూ బతుకుబండిని ఇన్నేళ్లు లాగేసాడు. ఎందుకంటే ఆ మధ్యధరా సముద్ర దీవి అంత అందంగా ఉంది మరి. 32 ఏళ్లుగా దీవిలోనే జీవితం ఆ పెద్దాయన పేరు మారో మొరాండీ. వయసు 81. 1989లో దక్షిణ పసిఫిక్ మహా సముద్రానికి వెళ్తుండగా... మధ్యలో బోట్ పాడైంది. దాంతో ఈ దీవికి వచ్చిపడ్డాడు. అనుకోకుండా ఆ ప్రాంతమే అతని ఇల్లు అయిపోయింది. అప్పట్లో ఆ దీవిని మరో పెద్దాయన కేర్ టేకర్‌గా చూసుకుంటున్నాడు. ఆయన రిటైర్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న మొరాండీ... తరువాత తానే దానికి కేర్ టేకర్‌గా ఉండాలనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా తన పడవను అమ్మేసి దీవిలోనే ఉండిపోయాడు. అక్కడే ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. నిజానికి ఆ ఇల్లు ముందే నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి షెల్టర్‌ను ఇల్లుగా చేసుకున్నాడు. దీవి నుంచి వెళ్లాలని లేదు 32 ఏళ్లుగా ఆ దీవిలోనే ఉంటున్న మొరాండీ... అలా జీవించేందుకు నానా కష్టాలు పడ్డాడు. ప్రకృతి విలయాలతో పోరాడాడు. దీవి అందం చెడిపోకుండా కాపాడాడు. ఐతే... 2016లో ఆ దీవిలో అతను ఉన్న విషయం తెలిసింది. ఆ దీవిని అతను ఖాళీ చెయ్యాలంటూ... లా మద్దలేనా ఆర్చిపెలాగో నేషనల్ పార్క్ నోటీస్ పంపింది. దాంతో వారి మధ్య న్యాయపోరాటం మొదలైంది. తాజాగా కోర్టు కూడా ఆ దీవి పార్కుకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో అతన్ని ఖాళీ చెయ్యమని చెప్పింది. ఐతే... ఐదేళ్లుగా మొరాండీకి మద్దతుగా చాలా మంది పిటిషన్‌పై సంతకాలు చేశారు. అధికారులు మాత్రం అతను ఖాళీ చెయ్యాల్సిందేనని పట్టుపట్టారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ దీవిని వదిలి వెళ్లడం బాధగా ఉంది. నేను ఒకప్పుడు మెయిన్ టౌన్‌కి శివార్లలో ఉండేవాణ్ని. ఇప్పుడు అక్కడికే వెళ్లి... షాపింగ్ చేసి బట్టలు కొనుక్కుంటా. నా జీవితాన్ని జీవిస్తా. అయినా నా జీవితంలో పెద్దగా మార్పేమీ రాదు. ఇకపైనా నేను సముద్రాన్ని చూస్తాను’ అని మొరాండీ తెలిపాడు. ( చదవండి: ఇదేం వింత.. చేతి వేళ్లు ఈ రంగులో ఉన్నాయేంటి? ) -
డీఎండీకే ఒంటరేనా?
సాక్షి, చెన్నై: డీఎండీకే ఒంటరి పయనానికి సిద్ధమవుతున్నట్టుంది. పార్టీ తరఫున 234 నియోజకవర్గాల్లోనూ పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి ఆ పార్టీ నేత విజయకాంత్ గురువారం నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న డీఎండీకేకు డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్ గల్లంతైంది. అయితే, పార్టీ ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు కాలేదు. దీంతో ఆ పార్టీ చిహ్నం ఢంకా మళ్లీ వారి చేతికే వచ్చినట్లైయింది. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధంగా ఉన్నా, అన్నాడీఎంకే నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే పలుమార్లు డీఎండీకే కోశాధికారి ప్రేమలతా విజయకాంత్ అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేసినా ఫలితం కనిపించలేదని చెప్పవచ్చు. దీంతో ఒంటరి పయనానికి డీఎండీకే సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో పార్టీ తరఫున ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు విజయకాంత్ నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ దరఖాస్తుల ఆహ్వానానికి చర్యలు చేప ట్టారు. ఈనెల 25 నుంచి మార్చి 5 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. తమిళనాడులో రిజర్వుడ్ స్థానానికి రూ.10వేలు, పుదుచ్చేరిలో రూ.5వేలు, జనరల్ స్థానానికి తమిళనాడులో రూ.15 వేలు, పుదుచ్చేరిలో 10 వేలు దరఖాస్తుతోపాటు డిపాజిట్ చెల్లించాలని విజయకాంత్ ప్రకటించారు. ఆప్‌తో కమల్ మంతనాలు.. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యం సైతం తమ నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటుకు పిలుపునిచ్చినా స్పందించిన పారీ్టలు కరువే. దీంతో తమ సిద్ధాంతాలకు అనుగుణంగా, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న, మార్పును ఆశిస్తున్న వారిని కలుపుకుని ముందుకు సాగేందుకు కమల్ సిద్ధమైనట్టున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కేజ్రీవాల్‌తో కమల్ ఫోన్లో సంప్రదింపులు జరిపి నట్టు, గురువారం రాష్ట్రంలోని ఆప్ వర్గాలతో మంతనాల్లో నిమగ్నం కావడం గమనార్హం. చదవండి: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు.. కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తాం -
థియేటర్లో మీరొక్కరే.. తోడుగా 60 సినిమాలు
థియేటర్ మొత్తానికి ఒక్కళ్లమే కూర్చొని సినిమా చూస్తే కలిగే ఫీలో, థ్రిల్లో ఎలా ఉంటుందో ఇటీవల కొందరు ప్రేక్షకులు ఢిల్లీలో, ముంబైలో, ఇంకా కొన్ని మెట్రోల్లో.. ఆఖరికి మన హైదరాబాద్‌లో కూడా విధిలేక అనుభూతి చెందారు. కొందరైతే కూర్చోలేక మధ్యలోనే హాల్ బయటికి వచ్చేశారు. కరోనా లేని నార్మల్ టైమ్‌లో కూడా ఒకరిద్దరితో నడిచిన సినిమాలు అక్కడక్కడా ఆడలేక పోలేదు. చాలాకాలం క్రితం ఓ నిర్మాత ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరారు. అతడు నిర్మించినది దెయ్యం సినిమా. ఆ దెయ్యం సినిమాను ఒంటరిగా ఒక్కరే హాల్లో కూర్చొని సినిమా మొత్తం చూస్తే ఎన్ని లక్షలో ఇస్తానని ఆయన ప్రకటించారు. ఫలితం ఏమైందన్నది ఇప్పుడు టాపిక్ కాదు. వందల సీట్ల మధ్య ఒక్కరమే కూర్చొని గంటా గంటన్నరసేపు సినిమా చూడ్డం ఎలా ఉంటుంది అన్నదీ కాదు. ఎవరికైనా అలా సింగిల్‌గా, ఏకాంతగా సినిమా చూడాలని ఉంటే వాళ్ల కోసం స్వీడన్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్లు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఏమిటా ఏర్పాట్లు, ఎలా వాళ్లను సమీపించాలి, టిక్కెట్ ధర ఎంత.. ఇలాంటివన్నీ నెట్లో వెదికితే దొరకుతాయి. ఏమైనా మీరు జనవరి 17 లోపు వెదకాలి. ఇప్పుడిక ఒంటరిగా సినిమా చూడాలని లేకపోయినా.. ఈ ఒంటరిగా సినిమా చూడ్డం ఏంటని తెలుసుకునేవాళ్ల కోసం ఈ స్టోరీ అంతా. సంగతేంటంటే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు స్వీడన్లో ఎర్తెబోజియే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఎర్తెబోజియే అనేది బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలోని ఒక స్వీడన్ పట్టణం. ఆ పేరును ఫిల్మ్ ఫెస్టివల్‌కు పెట్టనైతే పెట్టారు గానీ, సినిమాల స్క్రీనింగ్‌లన్నీ జరుగుతున్నది చాలా వరకు అక్కడికి సమీపంలోని పేటర్ నోస్టర్ దీవిలో. అందులో కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి. కొన్ని ఆ దీవిలోనే మరోచోట ఉంటాయి. మొత్తం 60 సినిమాలను ప్రదర్శిస్తారు. యేటా ఎర్తెబోజియే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ వస్తున్నదే కానీ ఈ ఏడాది ఫెస్టివల్ ఒక్కటే జరుగుతుంది. ప్రేక్షకులు ఉండరు. ఉండరంటే ఉండరని కాదు. స్క్రీన్‌కి ఒక్కరు, సినిమాకు ఒక్కరు, సినిమా వేళలకు ఒక్కరు ఇలా ఆ వారం రోజులూ వేర్వేరు కాల మాన స్థల పరిస్థితుల్లో సినిమాల ప్రదర్శన ఉంటుంది. ఇక ఆ సినిమాలు తీసిన వాళ్లు, నటించినవాళ్లు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లు, విమర్శకులు వీళ్లుంటారు కదా స్క్రీనింగ్ బ్రేక్‌లో.. వాళ్లందరితో ఆన్లైన్లో వర్చువల్ టాక్ ఉంటుంది. సరే, ఇప్పుడివన్నీ మామూలే. సోషల్ డిస్టెన్స్ కాబట్టి ఎర్తెబోజియే కూడా ప్రేక్షకులకు డిస్టెన్స్ పాటిస్తోంది. స్వీడన్‌లోని పేటర్ నోస్టర్ దీవి (ఇందులో కనిపిస్తున్నవి ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఏర్పాటు చేసిన థియేటర్లు); ఆ చివర ఉన్నది బాల్టిక్ సముద్రంలోని పేటర్ నోస్టర్ లైట్ హౌస్. ఒంటరివాడను నేను సింహం సింగిల్‌గా వస్తుంది అన్నట్లు ఈ ఫెస్టివల్ సినిమాలకు సింగిల్‌గా వచ్చేందుకు అర్హత సాధించినవాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది. ఉదాహరణకు ఎలాగంటే.. ఎర్తెబోజియేలో స్కాండినేవియమ్ ఇండోర్ ఎరీనా ఉంది. (ఫొటో చూడండి) అందులో కొన్ని స్క్రీన్లు ఉంటాయి. అలాంటి ఎరీనాలు, థియేటర్లు పేటర్ నోస్టర్ దీవిలోనూ మరికొన్ని ఉంటాయి. ఎర్తెబోజియే పట్టణం, పేటర్ నోస్టర్ దీవి ఆనుకునే ఉంటాయి. ఎవరికి ఏ సినిమాకు, ఏ ఆటకు, ఏ వేళకు లాటరీ తగిలితే (ఇవన్నీ ఆన్లైన్లోనే అయిపోతాయి. టికెట్ ధర మొదలు.. రానుపోను ఖర్చులన్నీ ‘ఒంటరివాడను నేను’ అని సరదాగా పాడుకుంటూ వెళ్లివాళ్లవే). ఆ సంగతి తెలీసీ వెళ్తారు కనుక, వెళ్లాక ఏం జరుగుతుందో చూద్దాం. రెడ్ కార్పెట్‌పై మీదుగా నడిచి థియేటర్లోకి వెళ్లగానే.. ‘వెల్కమ్ ఫలానా గారూ.. ఫిల్మ్ ఫెస్టివల్‌ను చూసేందుకు వచ్చిన మీకు మా స్వాగతం. ఈ సినిమాను ప్రత్యేకంగా మీకోసమే వేస్తున్నాం’ అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. తర్వాతేముంది? సినిమా చూడ్డమే. రెడ్ కార్పెట్ వరకు వెళ్లేందుకు మాత్రం దీవిలో పడవ దిగాక.. మరికొన్ని నీళ్లను, రాళ్లను, రప్పల్నీ, కప్పల్నీ, గాలుల్ని దాటుకుని వెళ్లాలి. అదొక అనుభూతి. పేటర్ నోస్టర్ దీవిలోని ఇండోర్ ఎరీనా (ఇందులో కొన్ని సినిమాలు మీ కోసం స్క్రీన్ అవుతాయి). కరోనా వచ్చి కొత్త కొత్త అనుభవాల్ని చూపించి వెళుతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐసోలేటెడ్ సినిమా’ కూడా అలాంటి అనుభవమే. చివరిగా ఒక మాట. టిక్కెట్ గెలుచుకున్నవారు ఆ షో ముగిసేవరకు కొన్నిటిని కోల్పోవలసి ఉంటుంది. ముందుగా సెల్ ఫోన్. తర్వాత ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు. అక్కడ ఉన్న వారం రోజులూ పూర్తిగా ఆ ఒంటరి వాళ్లవే. పూర్తిగా వాళ్లు ఒంటరి వాళ్లే. -
ఇక నుంచి ఒంటరి పోరే
లక్నో: ఇక ముందు జరిగే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు చిన్నవైనా, పెద్దవైనా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సోమవారం లక్నోలో ఆమె ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలిసి పోటీ చేశాయి. అయితే, అనుకున్న మేరకు ఫలితాలు దక్కలేదు. దాంతో వీరి పొత్తు కొనసాగే విషయం చర్చనీయాంశమైంది. మాయావతి తాజా ప్రకటనతో ఎస్పీతో పొత్తు ఉండదని తేలిపోయింది. ‘2012 నుంచి 2017 వరకు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ బీఎస్పీకి వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ల వంటి పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్పీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. వాటినన్నిటినీ మరిచి దేశప్రయోజనాల కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే, ఎన్నికల తర్వాత ఎస్పీ వైఖరి మమ్మల్ని ఆలోచించుకునేలా చేసింది. ఈ పొత్తుతో భవిష్యత్తులో బీజేపీని ఓడించడం సాధ్యం కాదనిపిస్తోంది. అందుకే ఇకపై పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అని మాయావతి హిందీలో ట్వీట్ చేశారు. దళితులు సమాజ్‌వాదీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు చేరువవుతున్నారన్న కోపంతోనే మాయావతి తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎస్పీ నేత రామ్‌శంకర్ అన్నారు. మాయవతి నిర్ణయంతో తమకేసంబంధం లేదని గఠ్బంధన్లో మరో భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ పేర్కొంది. మాయావతి తీరింతే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న మాయావతి ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు తెగతెంపులు చేసుకుంటారో అర్థం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన మూడ్‌ను బట్టి ఆమె నిర్ణయాలు తీసుకుంటారని వారన్నారు. 1993లో ఆమె మొదటిసారి ఎస్పీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. రెండేళ్ల తర్వాత కటీఫ్ చెప్పారు. 1995లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత 4నెలలకే దానికి టాటా చెప్పేశారు. 1996లో కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. 1997లో బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయ్యారు. 2002లో బీజేపీతో జతకట్టారు. మూడునెలల్లోపే పొత్తును విచ్ఛిన్నం చేశారు. 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని లాభం పొందారు. 2019లో ఆ పొత్తు కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీ ఎక్కువ లాభపడింది. అయినాసరే ఇప్పుడు ఎస్పీతో పొత్తును తెంచేసుకున్నారు. -
బాసూ.. బసు ఈజ్ బ్యాక్
బిపాసా బసు స్క్రీన్ మీద కనిపించి సుమారు మూడేళ్లు అయిపోయింది. 2015లో కనిపించిన ‘ఎలోన్’ ఆమె లాస్ట్ రిలీజ్. ఇప్పుడు గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. అయితే తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసే మళ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు. సింగర్ మైకా సింగ్ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణ్, బిపాస హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘వో కౌన్ తీ’ సినిమాలోనూ యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి ‘వో కౌన్ తీ’లో ఫస్ట్ హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ యాక్ట్ చేయాల్సింది. కానీ ఐష్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి బిపాస ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్–బిపాసా ప్రేమ వివాహం చేసుకున్నారు. మ్యారీడ్ లైఫ్ కోసమే రెండేళ్లు బ్రేక్ తీసుకున్నారామె. -
అతనింకా బతికే ఉన్నాడా...?
పేరు తెలీదు.. ఊరూ ఏంటో తెలీదు. దట్టమైన కారడవి.. ఎండా.. వాన.. చిమ్మచీకటి ఏదీ లెక్కచేయటం లేదు. ఎవరి తోడు, అండ లేకుండా 22 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తూ వస్తున్నాడో వ్యక్తి. తాజాగా బ్రెజిల్‌లోని ఇండియన్ ఫౌండేషన్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... బ్రసీలియా: రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా వెళ్తే ఈ ఒంటరి మనిషి కథ మొదలవుతుంది. 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. తాజాగా దాన్ని ఈ మధ్యే రిలీజ్ చేశారు. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. చాలా దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. అతన్ని చివరిసారిగా ఈ మే నెలలో చూసినట్లు ఇండియన్ ఫౌండేషన్ బృంద ప్రతినిధి అల్టెయిర్ అలగైర్ చెబుతున్నారు. అడుగు జాడల ఆధారంగా అతన్ని వెంబడిస్తూ.. అతని జీవన శైలిపై అధ్యయనం చేస్తూ వస్తున్నారు. ‘అతనో శాఖాహారి. దుంపలు, పండ్లు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. వీడియో వైరల్ అవుతుండగా.. అతని గురించి లక్షల్లో ఎంక్వైరీలు వచ్చిపడుతున్నాయని అలగైర్ పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నాడు?.. అసలు అతనింకా బతికే ఉన్నాడా? అన్న ఆత్రుతే ఎక్కువ మంది అడుగుతున్నారని ఆయన తెలిపారు. అయితే 1990లోనే అతని గురించి ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రపంచానికి పరిచయం చేయటం గమనించదగ్గ విషయం. తెగలపై దాడులు... అయితే బ్రెజిల్లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం భావిస్తోంది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనే ఓ అంచనా. అయితే ఇన్నేళ్లలో అతన్ని పలకరించే సాహసం ఆ బృందం చేయకపోవటం విశేషం. ‘ఆధునిక నాగరికతకు చెందిన మనుషులు అతనికి తారసపడితే ఎలా స్పందిస్తాడో అన్న ఆత్రుత మాలోనూ ఉంది’ అని అల్టెయిర్ అంటున్నారు. -
ఎవరి తోడు, అండ లేకుండా 22 ఏళ్లుగా..!
-
ఒంటరైన చిన్నారి
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ దేవేంద్ర పిల్లలు ఒంటరిగా మిగిలారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రామలక్ష్మణులపల్లెకు చెందిన ఊబిది లచ్చవ్వ, మల్లయ కూతురు దేవేంద్రకు దోమకొండకు చెందిన రఘుతో వివాహం జరిపించారు. రఘు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లగా.. దేవేంద్ర సమీప బంధువు కాశీరాంకు దగ్గరైంది. పెద్దల పంచాయతీతో ఇరువురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దేవేంద్ర కూతురు శ్రీవల్లి, కుమారుడు ఒంటరయ్యారు. శ్రీవల్లిని అమ్మమ్మ ఊరు రామలక్ష్మణుపల్లెకు తీసుకువచ్చారు. కుమారుడు తండ్రి రఘు ఇంట్లో ఉన్నాడు. -
బార్లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు
విద్యార్థుల జీవితంతో ప్రభుత్వం చెలగాటం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన ఖమ్మం అర్బన్ : విద్యాహక్కులను కాలరాస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. బార్లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని మండిపడ్డారు. బుధవారం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కనీస వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎంసెట్–2 మెడికల్ స్కాంలో అధికార టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని, తక్షణం వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న కేసీఆర్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఎంతసేపు మిషన్ కాకతీయ, భగీరథ, హరితహారంపైనే ప్రభుత్వం దృష్టి మళ్లించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని వేలాదిమంది విద్యార్థులతో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కాగా, కలెక్టరేట్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. 35 మందిని అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సుమంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నాయకులు అభిరామ్, నటరాజ్, మంగీలాల్, అభినవ్, శ్రీనివాస్, అక్బర్, రమేష్, నరేంద్ర, రాము, ఆశోక్, రాజశేఖర్, శ్రీకాంత్, గోపాల్, రత్నాకర్, గోపి పాల్గొన్నారు. పోటోరైటప్20సీకెఎం204 : ధర్నా చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు -
ఇక ఎలోన్ కాదు
శుభముహూర్తంలో చేసే పనులన్నీ శుభంగా జరుగుతాయంటారు. బహుశా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ముహూర్తం బాగుండి ఉంటుంది. ఎందుకంటే ఇక ఎప్పటికీ వాళ్లు ఎలోన్ కాదు. జాన్ అబ్రహాంతో సహజీవనం చేసి, విడిపోయాక బిపాసా ఒంటరి జీవితం గడిపారు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్ నుంచి విడిపోయి, జెన్నిఫర్ వింగెట్‌ను పెళ్లి చేసుకుని, ఆమె నుంచి విడాకులు తీసుకుని కరణ్ కూడా ఎలోన్‌గా మిగిలిపోయారు. ఈ ఒంటరితనమే బిపాసా, కరణ్‌లను దగ్గర చేసి ఉంటుంది. త్వరగానే ప్రేమలో పడ్డారు. అంతే త్వరగా విడిపోతారని చాలామంది ఊహించారు. కానీ, తమ బంధం చాలా గట్టిదని నిరూపిస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముంబైలో వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట రిసెప్షన్‌కి మాత్రం అందర్నీ ఆహ్వానించారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్, సుస్మితాసేన్, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా, జెనీలియా, ఆమె భర్త రితేష్, మాధవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నట్లు.. బిపాసా బసు తెలుగులో ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. -
ఒంటరిగా ఉండలేకపోతున్నాను
ముంబై: షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలుగదిలో ఒంటరిగా ఉండలేకపోతోందిట. సెల్ లో ఒంటరిగా ఉండడం వల్ల తనకు డిప్రెషన్ మరింత పెరుగుతుందని ఆమె ఆందోళన చెందుతోంది. అందుకే తనను ఐసోలేటెడ్ సెల్లో ఉంచొద్దంటూ జైలు అధికారులకు ఇంద్రాణి మొరపెట్టుకుంది. జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి డా. విజయ్ సత్బీర్ సింగ్ జైల్లో ఆమెను కలిసినపుడు ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను ఏకాకిగా ఉంచొద్దంటూ విజ్జప్తి చేసింది. అసలే డిప్రెషన్‌తో బాధపడుతున్న తనకు, విడిగా సెల్లో ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందని తెలిపింది. ఇది తన మానసిక స్థితిని మరింత దెబ్బ తీస్తుందని, తను ప్రత్యేక సెల్లో ఉంచొద్దని ఇంద్రాణి కోరింది. ఆమె విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆమె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమెను వేరే సెల్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందచేశారు. కోలుకున్న అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. -
అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు
ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్‌తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది.