
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ దేవేంద్ర పిల్లలు ఒంటరిగా మిగిలారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రామలక్ష్మణులపల్లెకు చెందిన ఊబిది లచ్చవ్వ, మల్లయ కూతురు దేవేంద్రకు దోమకొండకు చెందిన రఘుతో వివాహం జరిపించారు. రఘు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లగా.. దేవేంద్ర సమీప బంధువు కాశీరాంకు దగ్గరైంది. పెద్దల పంచాయతీతో ఇరువురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దేవేంద్ర కూతురు శ్రీవల్లి, కుమారుడు ఒంటరయ్యారు. శ్రీవల్లిని అమ్మమ్మ ఊరు రామలక్ష్మణుపల్లెకు తీసుకువచ్చారు. కుమారుడు తండ్రి రఘు ఇంట్లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment