Toofran
-
ఆపరేషన్ చేసిన రెండురోజులకే బాలింత మృతి!
సాక్షి, మెదక్ : జిల్లాలోని తుఫ్రాన్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలలు నిండకముందే గర్భిణీకి వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆపరేషన్ నిర్వహించిన రెండురోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆగ్రహించి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. 25 ఏళ్ల వసీమా అనే గర్భిణీ ఇటీవల తుఫ్రాన్‌లోని దేవీ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమెకు నెలలు నిండకముందే వైద్యులు హడావిడిగా ఆపరేషన్ నిర్వహించారని వసీమా బంధువులు తెలిపారు. ఆపరేషన్ చేసిన రెండురోజులకే వసీమా ప్రాణాలు విడిచిందని, ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వసీమా ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ఒంటరైన చిన్నారి
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ దేవేంద్ర పిల్లలు ఒంటరిగా మిగిలారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రామలక్ష్మణులపల్లెకు చెందిన ఊబిది లచ్చవ్వ, మల్లయ కూతురు దేవేంద్రకు దోమకొండకు చెందిన రఘుతో వివాహం జరిపించారు. రఘు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లగా.. దేవేంద్ర సమీప బంధువు కాశీరాంకు దగ్గరైంది. పెద్దల పంచాయతీతో ఇరువురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దేవేంద్ర కూతురు శ్రీవల్లి, కుమారుడు ఒంటరయ్యారు. శ్రీవల్లిని అమ్మమ్మ ఊరు రామలక్ష్మణుపల్లెకు తీసుకువచ్చారు. కుమారుడు తండ్రి రఘు ఇంట్లో ఉన్నాడు. -
పేకాట అడ్డాపై దాడి: 8మంది అరెస్ట్
తూఫ్రాన్ (మెదక్) : పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో జరిగింది. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... రావెల్లి గ్రామ సమీపంలోని మామిడి తోట వద్ద శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్.ఐ.వెంకటేశ్ సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేయగా కొందరు పారిపోగా 8 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14, 085, రెండు బైక్‌లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
తండ్రి దారుణహత్య: కొడుకుపై అనుమానం
తూఫ్రాన్ (మెదక్) : వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్‌పేట్ మండలం జీడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆశయ్య(68) వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న క్రమంలో అనుమానం రావడంతో ఆశయ్య కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఆస్తి కోసం కొడుకే తండ్రిని హతమార్చి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.