
సాక్షి, మెదక్ : జిల్లాలోని తుఫ్రాన్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలలు నిండకముందే గర్భిణీకి వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆపరేషన్ నిర్వహించిన రెండురోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆగ్రహించి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
25 ఏళ్ల వసీమా అనే గర్భిణీ ఇటీవల తుఫ్రాన్‌లోని దేవీ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమెకు నెలలు నిండకముందే వైద్యులు హడావిడిగా ఆపరేషన్ నిర్వహించారని వసీమా బంధువులు తెలిపారు. ఆపరేషన్ చేసిన రెండురోజులకే వసీమా ప్రాణాలు విడిచిందని, ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వసీమా ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.