తూఫ్రాన్ (మెదక్) : వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్‌పేట్ మండలం జీడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆశయ్య(68) వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న క్రమంలో అనుమానం రావడంతో ఆశయ్య కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఆస్తి కోసం కొడుకే తండ్రిని హతమార్చి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి దారుణహత్య: కొడుకుపై అనుమానం
Published Sat, May 28 2016 4:08 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement