రోజూ కనీసం అర్థగంట సేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఖర్చులేనిది. అనువైంది కూడా క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చు. సాధారణంగా, గుంపులుగా, జంటలుగా, స్నేహితులతో వాకింగ్ చేస్తూ ఉండటం, పార్కింగ్‌ల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం. అయితే వాకింగ్ ఎలా చేయాలి. ఎపుడు చేయాలి? ఒంటరిగాచేయాలా? లేక తోడు ఉంటే మంచిదా? ఇలాంటి విషయాల గురించి ఎపుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి!
ఏ సమయంలో చేయాలి?
వ్యాయామం ఎపుడు చేసినా దాని ప్రయోజనాలు దానికుంటాయి. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిదని చెబుతారు. ఉదయం ట్రాఫిక్ బెడద ఉండదు, కాలుష్యం తక్కువ. వీటిన్నింటికంటే ఉదయం వాతావరణం ప్రశాంగంగా ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలు, శరీరానికి, మనసుకు ఉత్తేజానిస్తాయి.
రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున రోజులో గంట చేసినట్టువుతుంది. వాకింగ్‌ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. అటవాటైన కొద్దీ క్రమంగా వేగం పెంచాలి. షుగర్ పేషెంట్లే, గుండె జబ్బులున్నవారు ఏదైనా కాస్త తిన్నాక చేయడం మంచిది. వాకింగ్ కోసం సౌకర్యవంతంగా ఉండే షూస్ ధరించడం, పార్క్‌ల్లో కాకుండా ఆరుబయట నడిచే వారు కుక్కల నుంచి తప్పించుకునేందుకు చేతి కర్ర ఉంటే మంచిది.
ఒంటరిగా చేయాలా? తోడు ఉండాలా?
ఒంటరిగా నడవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది, నడకచురుగ్గా ఉంటుంది
మాట్లాడుకుంటూ నడిస్తే తొందరంగా ఆయాసం వస్తుంది. ఏకాగ్రత ఉండదు.
ఏదైనా వ్యాయామంద్వారా ప్రయోజనం పొందాలంటే కాన్‌సెంట్రేషన్ ముఖ్యం. ఇద్దరు లేదా ముగ్గురుఉంటే ఇది సాధ్యపడకపోవచ్చు. సరైన వేగంతో నడిస్తేనే ఫలితం బావుంటుంది. కనుక ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఒంటరిగా నడవడం ఉత్తమ మార్గం.
అయితే భర్త లేదా భార్యతోనో, స్నేహితులతోనో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. ఎలా అంటే..
పార్టనర్ ఉంటే నడక బోర్ కొట్టదు. ఉత్సాహంగా ఉంటుంది.
జంటగా అయితే మీ వేగాన్ని అందుకోగల వారైతే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. పోటీ తత్వం ఉంటుంది.
వృద్ధులు తమతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు మరింత సురక్షితంగా భావిస్తారు.
పెద్దవాళ్లు గుంపులుగా నడవడం ఖచ్చితంగా సురక్షితం.
వాకింగ్ ఎపుడు, ఎలా అనేది మనకున్న వెసులుబాటు, మనం అనుకున్న లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో చేసినపుడు మాత్రమే చక్కటి ఫలితం లభిస్తుంది.
ఇదీ చదవండి: గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో!
Comments
Please login to add a commentAdd a comment