యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.
హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment