న్యూఢిల్లీ: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..
కాంగ్రెస్‌తో పొత్తు లేదు
సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.
ఐదు సీట్లకు పరిమితమై..
ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్ తన డిమాండ్‌ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్ అందుకు అంగీకరించలేదు.
ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు
హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్ సాయముంటే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
పేలవమైన పార్టీ పనితీరు
హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్‌కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.
బీజేపీకి అనుకూల గాలి
హర్యానాలో బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్‌కు ఆప్‌కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్‌కు కష్టమయ్యింది.
అట్టడుగు నుంచి మద్దతు శూన్యం
హర్యానాలో ఆప్‌కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.
చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు
హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.
ఆకట్టుకోవడంలో విఫలం
ఆప్ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.
వ్యూహాత్మక అంచనా లోపం
హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి దారితీసింది.
సమయం కేటాయించని నేతలు
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్‌కు కాంగ్రెస్‌తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్‌కి భారంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment