చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సీఎం పదవికి నాయబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలాఉండగా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు బెయిల్ మంజూరు చేయడంపై అనేక విమర్శలు తలెత్తాయి. బీజేపీనే డేరా బాబాకు ఎన్నికలకు ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి.
జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మద్దతు కోసం రామ్‌రహీమ్‌కు పెరోల్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్‌రహీమ్ విడుదల ఏ పార్టీకి కలసివచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
డేరా మద్దతుదారులున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 10, ఐఎన్‌ఎల్‌డీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 53.57 శాతం, బీజేపీకి 35.71 శాతం, ఐఎన్‌ఎల్‌డీకి 7 శాతం, స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలు చూస్తే ఈ 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికంగా ప్రయోజనం పొందింది.
మీడియా కథనాల ప్రకారం హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని రామ్‌రహీమ్ సత్సంగ కార్యక్రమంలో తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం ఐదుగురు ఓటర్లను బూత్‌కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా ఈ సూచించినట్లు పలు వార్తలు వినిపించాయి. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లకు మద్దతును అందించారు. 2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు.
ఇది కూడా చదవండి: గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment