ram rahim singh
-
హర్యానా ఎన్నికల్లో ‘డేరా బాబా’ ప్రభావమెంత?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సీఎం పదవికి నాయబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలాఉండగా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు బెయిల్ మంజూరు చేయడంపై అనేక విమర్శలు తలెత్తాయి. బీజేపీనే డేరా బాబాకు ఎన్నికలకు ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి.జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మద్దతు కోసం రామ్‌రహీమ్‌కు పెరోల్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్‌రహీమ్ విడుదల ఏ పార్టీకి కలసివచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.డేరా మద్దతుదారులున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 10, ఐఎన్ఎల్డీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 53.57 శాతం, బీజేపీకి 35.71 శాతం, ఐఎన్ఎల్డీకి 7 శాతం, స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలు చూస్తే ఈ 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికంగా ప్రయోజనం పొందింది.మీడియా కథనాల ప్రకారం హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని రామ్‌రహీమ్ సత్సంగ కార్యక్రమంలో తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం ఐదుగురు ఓటర్లను బూత్‌కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా ఈ సూచించినట్లు పలు వార్తలు వినిపించాయి. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లకు మద్దతును అందించారు. 2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు. ఇది కూడా చదవండి: గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత -
పెరోల్‌పై డేరా బాబా విడుదల.. ఆశ్రమంలో సందడి
రోహ్ తక్(హర్యానా): డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)పెరోల్ పై విడుదలయ్యారు. రోహ్తక్లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసు భద్రత మధ్య యూపీలోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి వాతావరణం నెలకొంది.రామ్ రహీమ్‌కు ఇరవై రోజుల పెరోల్ మంజారయ్యింది. ఈ పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ 20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి పెరోల్ మంజూరైంది. పెరోల్ నిబంధనల ప్రకారం డేరా చీఫ్ హర్యానా ఎన్నికలకు దూరంగా ఉండాలి. #WATCH हरियाणा: डेरा सच्चा सौदा प्रमुख गुरमीत राम रहीम सिंह को 20 दिन की पैरोल मिलने के बाद रोहतक की सुनारिया जेल से रिहा कर दिया गया। pic.twitter.com/0pUomsdRrt— ANI_HindiNews (@AHindinews) October 2, 2024రామ్ రహీమ్ పెరోల్ దరఖాస్తును జైలు అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. పెరోల్ లభిస్తే తాను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉండేందుకు సిద్ధమని డేరా చీఫ్ తెలిపారు. 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో జైలు శిక్ష పడింది.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
హర్యానా ఎన్నికలకు పెరోల్‌పై డేరా బాబా రాక?
రోహ్తక్: ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి 20 రోజుల తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన పెరోల్‌కు అభ్యర్థించారు. దీంతో ఈ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.రామ్ రహీమ్ ఈ ఏడాది ఆగస్టు 13న 21 రోజుల పెరోల్‌పై రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలో లక్షలాదిమంది అనుచరులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వస్తే, అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో అక్టోబరు 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం -
మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. Rape convict Ram Rahim celebrated his freedom by cutting a cake with a sword. Several of his followers joined him in his celebration. It's absolute shamelessness on the part of the Haryana government. They have done this to gain votes: @BrindaAdige@aishvaryjain pic.twitter.com/4oYnYcpSVH — TIMES NOW (@TimesNow) January 23, 2023 సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది. చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి -
అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు స్వల్ప ఊరట లభించింది. డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మంజూరు అయ్యింది. అదీ ఎన్నికల వేళ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.. 2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ జారీ చేశారు. దీంతో ఈ సాయంత్రం(సోమవారం) గుర్మీత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రం పంజాబ్‌లో ఎన్నికలకు రెండు వారాల ముందే రహీమ్‌సింగ్ విడుదలకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు. -
చిన్నతప్పుతోనే పంచకుల రణరంగం
ఛండీగఢ్: కేంద్ర బలగాలతో ముందస్తు మోహరింపులు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, చెక్ పోస్టుల ఏర్పాటు... ఇవేవీ పంచకులను రణరంగంగా మార్చకుండా ఆపలేకపోయాయి. తీర్పు నేపథ్యంలో జారీ చేసిన నిషేధాజ్నల ఉత్తర్వుల్లోని ఓ చిన్న తప్పిదమే 31 ప్రాణాలు పోయేందుకు కారణమైందన్న వాదన వినిపిస్తోంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పై అత్యాచార కేసులో ఈ నెల 25న తీర్పు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన హరియాణా ప్రభుత్వం ముందస్తుగా ఓ ఆర్డర్‌ను ఆగష్టు 18న, తిరిగి 22న మరో ఆర్డర్‌ను జారీ చేసింది. వాటిలో పంచకులకు వచ్చే ప్రజలు ఎలాంటి ఆయుధాలు తీసుకురావటానికి వీల్లేందంటూ పేర్కొంది. అయితే జనాలు గుంపులుగా గుమిగూడొద్దనే వ్యాఖ్యను మాత్రం చేర్చలేదు. ఇదే కొంప ముంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఈ ఆర్డర్లలో పొరపాటు ఉందంటూ 24వ తేదీ అంటే తీర్పు వెలువరించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అడ్వొకేట్ జనరల్ బీఆర్ మహాజన్ బీఆర్ మహాజన్ కోర్టుకు కోరి "ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండటం" అన్న పదంను చేర్పించి కొత్త ఆర్డర్‌ను తీసుకొచ్చారు. అయితే అప్పటికే సుమారు 2,00,000 మంది అనుచరులు పంచకులకు చేరుకోవటం, వారిని ఖాళీ చేయించే యత్నంలో బలగాలు విఫలమవ్వటం, ఆపై తీర్పు వెలువడటం, ఆగ్రహంతో రెచ్చిపోయిన డేరా అనుచరులు ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయటం, మరీ ముఖ్యంగా అల్లర్లలో ప్రాణాలు బలికావటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. -
జార్ఖండ్‌లో సినిమా ప్రదర్శనపై నిషేధం
గిరిజన ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ.. 'ఎంఎస్‌జి 2- ద మెసెంజర్' సినిమాను నిషేధిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యాఖ్యలు గిరిజనుల సెంటిమెంట్లను కించపరుస్తున్నాయని, అందుకే సినిమా గురించిన సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ సినిమాను నిషేధించాల్సిందిగా అధికారులకు సూచించారని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. జార్ఖండ్ జనాభాలో 27 శాతం మంది గిరిజనులే. ఆ రాష్ట్రానికి తొలి గిరిజనేతర ముఖ్యమంత్రి రఘువర్ దాస్.