జార్ఖండ్లో సినిమా ప్రదర్శనపై నిషేధం | Jharkhand bans 'MSG 2 - The Messenger' | Sakshi
Sakshi News home page

జార్ఖండ్లో సినిమా ప్రదర్శనపై నిషేధం

Published Sat, Sep 19 2015 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

జార్ఖండ్లో సినిమా ప్రదర్శనపై నిషేధం

జార్ఖండ్లో సినిమా ప్రదర్శనపై నిషేధం

గిరిజన ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ.. 'ఎంఎస్జి 2- ద మెసెంజర్' సినిమాను నిషేధిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.

ఈ వ్యాఖ్యలు గిరిజనుల సెంటిమెంట్లను కించపరుస్తున్నాయని, అందుకే సినిమా గురించిన సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి రఘువర్దాస్ సినిమాను నిషేధించాల్సిందిగా అధికారులకు సూచించారని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. జార్ఖండ్ జనాభాలో 27 శాతం మంది గిరిజనులే. ఆ రాష్ట్రానికి తొలి గిరిజనేతర ముఖ్యమంత్రి రఘువర్ దాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement