రోహ్ తక్(హర్యానా): డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)పెరోల్ పై విడుదలయ్యారు. రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసు భద్రత మధ్య యూపీలోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి వాతావరణం నెలకొంది.
రామ్ రహీమ్‌కు ఇరవై రోజుల పెరోల్ మంజారయ్యింది. ఈ పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ 20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి పెరోల్ మంజూరైంది. పెరోల్ నిబంధనల ప్రకారం డేరా చీఫ్ హర్యానా ఎన్నికలకు దూరంగా ఉండాలి.
#WATCH हरियाणा: डेरा सच्चा सौदा प्रमुख गुरमीत राम रहीम सिंह को 20 दिन की पैरोल मिलने के बाद रोहतक की सुनारिया जेल से रिहा कर दिया गया। pic.twitter.com/0pUomsdRrt
— ANI_HindiNews (@AHindinews) October 2, 2024
రామ్ రహీమ్ పెరోల్ దరఖాస్తును జైలు అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. పెరోల్ లభిస్తే తాను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉండేందుకు సిద్ధమని డేరా చీఫ్ తెలిపారు. 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో జైలు శిక్ష పడింది.
ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
Comments
Please login to add a commentAdd a comment