చండీగఢ్: హర్యానాలోని మొత్తం 90 లోక్‌సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.
భూపేంద్ర సింగ్ హుడా
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.
నాయబ్ సింగ్ సైనీ
మనోహర్ లాల్ ఖట్టర్‌ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌కు చెందిన మేవా సింగ్ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.
అనిల్ విజ్
హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.
దుష్యంత్ చౌతాలా
ఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.
వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్‌పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.
సావిత్రి జిందాల్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment