
బిపాసా బసు
బిపాసా బసు స్క్రీన్ మీద కనిపించి సుమారు మూడేళ్లు అయిపోయింది. 2015లో కనిపించిన ‘ఎలోన్’ ఆమె లాస్ట్ రిలీజ్. ఇప్పుడు గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. అయితే తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసే మళ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు. సింగర్ మైకా సింగ్ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణ్, బిపాస హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘వో కౌన్ తీ’ సినిమాలోనూ యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి ‘వో కౌన్ తీ’లో ఫస్ట్ హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ యాక్ట్ చేయాల్సింది. కానీ ఐష్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి బిపాస ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్–బిపాసా ప్రేమ వివాహం చేసుకున్నారు. మ్యారీడ్ లైఫ్ కోసమే రెండేళ్లు బ్రేక్ తీసుకున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment