comeback
-
పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.టాప్ టెన్ సంపన్నుడుఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.కలిసొచ్చిన సెప్టెంబర్ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.అనిల్ అంబానీ నెట్వర్త్తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్‌వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు. -
‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు!
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్‌టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్‌టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్‌మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. -
#MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇటీవలే టెస్ట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడో లేదో ఈసీబీ అతన్ని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కోసం ఎంపిక చేసింది. ఇక జూన్ 16 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ సిద్ధమవుతున్నాడు. జాక్ లీచ్ గైర్హాజరీలో మొయిన్ అలీ జట్టు బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్‌స్టోక్స్ అని మొయిన్ అలీ రివీల్ చేశాడు. స్టోక్స్ చెప్పిన యాషెస్ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొయిన్ అలీ మాట్లాడాడు. ''స్టోక్స్ నేను సరదాగా చాట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్?(Ashes?) అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్ లీచ్ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్(Lol) అని మెసేజ్ చేశా. అంతే స్టోక్స్ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్ లీచ్ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్‌కు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్‌లో నీ అవసరం ఉందని స్టోక్స్ నాతో అన్నాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. అందునా యాషెస్ అనే పదం వినగానే నాలో ఉత్సాహం వచ్చింది.. ఆడాలని నిశ్చయించుకున్నా. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు బెన్‌స్టోక్స్ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ వివరించాడు. మొయిన్ అలీ కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడి 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇక స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టుల్లో దూసుకుపోతుంది. బజ్‌బాల్ విధానంతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు స్టోక్స్ కెప్టెన్సీలో 13 టెస్టుల్లో 11 విజయాలు నమోదు చేయడం విశేషం. 2015 తర్వాతి నుంచి మరో యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను ఓడించి యాషెస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. Moeen Ali's response when Ben Stokes first approached him about an Ashes comeback: "lol" 😂 pic.twitter.com/qIy8Jf6Btx — ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2023 చదవండి: అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్.. అభిమానులకు పండగే! -
ఆ కత్తి.. ఒక కూడలి !
రామ్‌పూర్ (యూపీ): 1980 నాటి బాలీవుడ్ సినిమాల్లో రామ్‌పూర్ కత్తి అంటే ప్రేక్షకులకి ఒక పిడిబాకే. ఆ కత్తితో చేసే విన్యాసాలు హడల్ పుట్టించేవి. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఒకప్పుడు కత్తులకు, కటార్లకు బాగా ఫేమస్. అత్యంత నాణ్యమైన కత్తులు లభించేవి. ఫోల్డబుల్ కత్తులు ఎవరికైనా కావాలంటే రామ్‌పూర్ వెళ్లవలసిందే. ఎప్పుడైతే చైనా మార్కెట్ భారత్‌ను ముంచేసి తక్కువ ధరకే చాకులు లభ్యమయ్యాయో ఈ రామ్‌పూర్ చాకుల్ని జనం కొనడం మానేశారు. అయినప్పటికీ దానికుండే క్రేజ్ దానికి ఉంది. అందుకే రామ్‌పూర్ అధికారులు నైనిటాల్ నుంచి రామ్‌పూర్‌కు వచ్చే మార్గంలో ఒక కూడలిలో ఈ కత్తిని ఏర్పాటు చేశారు. దానికి రామ్‌పూర్ చాకు చౌక్ అని పెట్టారు. దాదాపుగా 20 అడుగుల ఎత్తైన రామ్‌పూర్ కత్తి ఇప్పుడు ఠీవీగా కనిపిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఈ కత్తి పేరు చెబితే హడలిపోయేవారే ఇప్పుడు దానినొక కళాకృతి కింద చూడడం విశేషం. -
రా..రమ్మని..! ఐటీ కంపెనీలు విజ్ఞప్తులు
సాక్షి, హైదరాబాద్: రా..రమ్మని..రా..రా..రమ్మని.. అంటూ ఓ సినిమా పాట తరహాలో మారింది నగరంలో టెకీల తీరు. నగరం కోవిడ్ నుంచి కోలుకోవడంతోపాటు.. ప్రస్తుతం అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థాయిలో ఊపందుకున్నాయి. కానీ ఇప్పటికీ ఐటీ రంగంలో పలు కంపెనీల ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆఫీసులకు రావడం లేదు. వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అవసరమైతే తప్ప కార్యాలయాల మెట్లు ఎక్కడం లేదు. దీంతో పలు కంపెనీలు, ఐటీ శాఖ వర్గాలు వీరిని పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు వారితో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ వర్గాలు సైతం ఉద్యోగులు ఆఫీసుల బాట పట్టేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఒకటికి మించి కొలువులు..? గ్రేటర్ పరిధిలో చిన్న,పెద్ద,బహుళజాతి సంస్థలకు చెందిన 1600కు పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో సుమారు 7.80 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ కాకపోయినా నగరానికి చెందిన పలు కంపెనీల ఉద్యోగులు ఏకకాలంలో రెండు కంపెనీల్లో పనిచేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండడం, రెండు కంపెనీల్లోనూ ఒకే రకమైన ప్రాజెక్టులు కావడం, రాత్రి వేళల్లో పనిచేసేందుకు పనివేళలు అనువుగా ఉండడం తదితర కారణాలే ఒకటికి మించి కొలువులు ఏకకాలంలో చేసేందుకు అవకాశం ఉందని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు. నచ్చినట్టుంటేనే.... ఇటీవలి కాలంలో నగర ఐటీ కంపెనీల్లో జంప్‌జలానీలు అధికమయ్యారని హైసియా తాజా అధ్యయనంలో తేలింది. వేతనాలు అధికంగా ఉన్నవి,ఇతర అలవెన్సులు, సెలవులు, పనివేళలు తమకు అనుకూలంగా ఉన్నవి, వర్క్ ఫ్రంహోంకు అనుమతించిన కంపెనీల్లో పనిచేసేందుకు టెకీలు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమైంది. ఇళ్లు వీడి విధిగా ఆఫీసుకు రావాలని కోరితే కొందరు ఉద్యోగులు ఏకంగా ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి బైబై చెబుతున్నారట. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు స్థిరంగా కొన్నేళ్లపాటు ఒకే కంపెనీలో పనిచేస్తారన్న నమ్మకం కాస్తా సడలినట్లు హైసియా వర్గాలు చెబుతుండడం లేటెస్ట్ ఐటీ ట్రెండ్‌గా మారింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ) -
'రైనా.. ప్లీజ్ తిరిగి రావా'
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ముంబైతో మ్యాచ్ మినహా రాజస్తాన్, డిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైంది. బౌలింగ్‌లో ఎంతో కొంత నయంగా కనిపిస్తున్న చెన్నై బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. మిడిలార్డర్లో డుప్లెసిస్ తప్ప ఓపెనర్లు వాట్సన్, మురళీ విజయ్, రుతురాజ్, కేదార్ జాదవ్‌లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశ పరుస్తున్నారు. ఇక ధోని బ్యాటింగ్ అంశంపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడమేంటని విమర్శలు వస్తున్నాయి. ఇక ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, శ్యామ్ కర్జన్‌లు పూర్తిగా తేలిపోతున్నారు. ముంబైతో మ్యాచ్‌లో అంబటి రాయుడు, డుప్లెసిస్ ప్రదర్శనతో గట్టెక్కిన చెన్నై రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి రాయుడు గాయంతో దూరమవ్వడంతో నాసిరక ప్రదర్శన చేసింది. డుప్లెసిస్ ఒక్కడే పోరాడుతున్నా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో సురేశ్ రైనా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రైనా జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండేదని.. చెన్నైకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైనా తిరిగి ఐపీఎల్‌కు రావాలంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ' రైనా.. నీ అవసరం జట్టుకు ఎంతో ఉంది. మిడిలార్డర్లో నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ప్లీజ్.. రైనా తిరిగిరావా' అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎస్కే అభిమానులు వేల సంఖ్యలో మెసేజ్‌లు చేస్తున్నారు.(చదవండి : రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది) ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే రైనా జట్టుతో కలిసి దుబాయ్‌కు చేరుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్ నుంచి ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. అయితే చెన్నై జట్టు యాజమాన్యంతో రైనాకు పొసగలేదని.. శ్రీనివాసన్‌తో విభేదాలు వచ్చాయంటూ .. అందుకే ఐపీఎల్ ఆడకుండానే వెనుదిరిగాడంటూ పుకార్లు వచ్చాయి. అయితే అదే సమయంలో రైనా కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం.. ఆ కారణంతోనే తిరిగి వచ్చాడా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. రైనా ఈ పుకార్లన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే లీగ్‌కు దూరమయ్యానని.. త్వరలోనే చెన్నై జట్టులో చేరుతానని వెల్లడించాడు. అయితే రైనా కమ్‌బ్యాక్‌పై చెన్నై జట్టు యాజమాన్యం ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్నా.. వెంటనే బరిలోకి దిగే అవకాశం రైనాకు లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా సరే క్వారంటైన్లో ఉండాల్సిందే. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి ఇస్తారు. బీసీసీఐ క్వారంటైన్‌ను 36 గంటలు కుదించినప్పటికి రైనా దుబాయ్‌కు చేరినా ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. అయితే ఈ విషయంలో రైనా ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 13వ సీజన్ సీఎస్కే, ముంబై ఇండియన్స్ ప్రారంభ మ్యాచ్‌కు చెన్నై జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నిజంగా రైనా లేకపోవడం చెన్నైకి పెద్ద దెబ్బేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాగా సురేశ్ రైనా ఐపీఎల్లో 193 మ్యాచ్‌లాడి 5368 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రైనా రికార్డులకెక్కాడు. ఆగస్టు 15, 2020న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. (చదవండి : ఆ తప్పు మళ్లీ చేయకూడదనుకున్నా : పృథ్వీ షా) Missing.. ! Without him the CSK batting order is completely disaster! 😭 No One can Replace Raina! ☝️🔥 @ImRaina pic.twitter.com/IlG0Zl9hIz — Super Raina FC™ 🧘♂️💛 (@CSK_FanTweets) September 25, 2020 Dhoni and Csk without Raina pic.twitter.com/SBj9V45dCo — Itachi (@Reymar10i) September 25, 2020 Bring back Raina .#Raina #Dhoni pic.twitter.com/FL8G2RE4BS — Rohit Sheokand (Jaat Boy) (@RohitSheokand16) September 25, 2020 -
మళ్లీ భారత్‌కు ఆడతా: డీకే
న్యూఢిల్లీ: భారత వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ తాను మళ్లీ భారత జట్టుకు ఆడగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు సారథిగా ఉన్న అతను గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో వైఫల్యంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అతను చెబుతున్నాడు. టి20ల్లో తనకు మెరుగైన రికార్డు ఉందని, కుర్రాళ్లతో దీటుగా పొట్టి ఫార్మాట్ ఆడగలనని చెప్పాడు. ‘గత ప్రపంచకప్ నాకు చేదు అనుభవాన్నిచ్చింది. ఆశించినట్లు ఆడలేకపోయాను. బాగా ఆడాల్సిన కీలక సమయంలో చేతులెత్తేయడంతో జట్టు నుంచి తప్పించారు. ఇది అర్థం చేసుకోగలను. అయితే పొట్టి ఫార్మాట్లో నాకు మంచి రికార్డు ఉంది. భారత టి20 జట్టులోకి వచ్చే అర్హత నాకూ ఉందని నేను భావిస్తున్నాను. పైగా నేను ఇటీవల దేశవాళీ టి20ల్లో బాగా ఆడాను. పునరాగమనం చేస్తాననడంలో నాపై నాకెలాంటి సందేహం లేదు’ అని అన్నాడు. గతేడాది జట్టుకు దూరమవడం భారంగా ఉన్నా... దేశానికి ఆడాలన్న కసి తనలో ఏమాత్రం తగ్గలేదన్నాడు. తన 15 ఏళ్ల కెరీర్ ఆసాంతం ఎత్తుపల్లాలతోనే సాగిందని చెప్పుకొచ్చాడు. టి20ల్లో అతని గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. 143.52 స్ట్రయిక్ రేట్, 33.25 సగటుతో కార్తీక్ పరుగులు సాధించాడు. ఐపీఎల్లో రాణించి పునరాగమనం చేయాలని కార్తీక్ భావిస్తుండగా... కోవిడ్–19 కారణంగా లీగ్ జరిగే అవకాశం లేకపోవడంతో అతని కోరిక నెరవేరడం అంత సులువు కాదు. దీనిపై అతను మాట్లాడుతూ ‘టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది. నేనే కాదు మొత్తం ప్రపంచమే నమ్మకంపై నడుస్తుంది’ అని అన్నాడు. -
వాయిదా పడితే నేనాడేది కష్టమే
జొహన్నెస్‌బర్గ్: కోచ్ మార్క్‌బౌచర్ కోరిక మేరకు పునరాగమనం చేస్తానన్న దక్షిణాఫ్రికా ‘మిస్టర్ 360’ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ టి20 ప్రపంచకప్ వాయిదా పడితే మాత్రం ఆడేది అనుమానమేనన్నాడు. ఆసీస్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. అయితే ప్రపంచాన్ని కోవిడ్–19 చుట్టేయడంతో ప్రతీ టోర్నీ వాయిదా లేదంటే రద్దు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఆరు నెలల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడెలా చూసేది. ఒకవేళ ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడితే ఎన్నో మారిపోతాయి. ఇప్పుడైతే నేను వందశాతం ఆడేందుకు సిద్ధమే. కానీ వచ్చే ఏడాది నా శరీరం సహకరిస్తుందో లేదో! కాబట్టి తప్పుడు ఆశల్ని కల్పించను’ అని అన్నాడు. బౌచర్ (కోచ్) అడిగినప్పుడు ఆసక్తి కనబరిచానని, ఇప్పుడు వాయిదా పడితే మాత్రం పునరాగమనం కష్టమేనన్నాడు. ‘నేను వందశాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాను. లేదంటే ఆడను. కొందరిలా... 80 శాతం ఫిట్నెస్ ఉన్నా ఆడేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చే వ్యక్తిని కాదు’ అని ఏబీ స్పష్టం చేశాడు. గత వన్డే ప్రపంచకప్‌కు ముందు, తర్వాత తలెత్తిన వివాదం మరోసారి రేగేందుకు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నాడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ గత మెగా ఈవెంట్ ఆడేందుకు ఆసక్తి కనబరిచినా... దక్షిణాఫ్రికా జట్టు ససేమిరా అంది. ఈ మేటి బ్యాట్స్‌మన్ లేని సఫారీ జట్టు ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఏబీని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు దక్షిణాఫ్రికాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
బాసూ.. బసు ఈజ్ బ్యాక్
బిపాసా బసు స్క్రీన్ మీద కనిపించి సుమారు మూడేళ్లు అయిపోయింది. 2015లో కనిపించిన ‘ఎలోన్’ ఆమె లాస్ట్ రిలీజ్. ఇప్పుడు గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. అయితే తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసే మళ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు. సింగర్ మైకా సింగ్ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణ్, బిపాస హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘వో కౌన్ తీ’ సినిమాలోనూ యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి ‘వో కౌన్ తీ’లో ఫస్ట్ హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ యాక్ట్ చేయాల్సింది. కానీ ఐష్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి బిపాస ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్–బిపాసా ప్రేమ వివాహం చేసుకున్నారు. మ్యారీడ్ లైఫ్ కోసమే రెండేళ్లు బ్రేక్ తీసుకున్నారామె. -
ఇస్తినమ్మ వాయనం...
‘తుమ్హారీ సులూ’ సినిమా తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బసవతారకం రోల్ చేస్తున్నారు విద్యా బాలన్. ఆ మధ్య ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ యాక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అప్డేట్ ఇంకా లేదు. ఆయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారమేంటంటే తమిళంలో జ్యోతిక కమ్‌బ్యాక్ చిత్రంగా చేసిన ‘36 వయదినిలే’ హిందీ రీమేక్‌లో నటించడానికి విద్యా ఆసక్తికరంగా ఉన్నారని టాక్. ‘36 వయదినిలే’ మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు రీమేక్. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం, సబ్జెక్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశారట విద్యా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనంలా ఉంది విద్యా బాలన్, జ్యోతికల పరిస్థితి. ఒక పక్క విద్యా బాలన్ ‘తుమ్హారీ సులూ’ రీమేక్ లో జ్యోతిక యాక్ట్ చేస్తుంటే, విద్యా బాలన్ ఏమో జ్యోతిక సినిమా రీమేక్ చేయాలనుకోవడం విశేషం. -
ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ
వాషింగ్టన్: అనారోగ్యం కారణంగా స్వల్ప విరామం అనంతరం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గురువారం తిరిగి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘ఇప్పటి నుంచి నవంబర్ 8 వరకు నేనెక్కడికెళ్లినా దేశం కోసం నా ప్రణాళికల గురించి మాట్లాడతా. 38 విధాన పరమైన అంశాల్లో సమగ్ర ప్రణాళికలు వివరిస్తా’ అని తెలిపారు. -
రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని
చెన్నై: మాజీ హీరోయిన్, టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని సతీమణి అమల అక్కినేని రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమల తాజాగా ఓ మలయాళ సినిమాలో న్యాయవాది పాత్రను పోషిస్తున్నారట. ఆంటోనీ సోనీ సారధ్యంలో డెబ్యూ మూవీగా వస్తున్న చిత్రం 'కేరాఫ్ సైరాబాను' అనే చిత్రంలోఆమె నటించనున్నారట. ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో ఆమె కనిపించబోతున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ ప్రవక్త సైరాబాను పాత్రను మంజు వారియర్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ త్వరలోనే మొదలు కానుందని వివరించాయి. కాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడుగా 1991లో వచ్చిన ' ఉల్లడక్కం' సినిమాలో అమల నటించారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమల హమారీ అధూరీ కహానీ బాలీవుడ్ చిత్రంలో ఆఖరిసారిగా నటించిన సంగతి తెలిసిందే. -
స్వైన్ ప్లూ పంజా
-
ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్న ఫీలింగ్ లేదు..
న్యూఢిల్లీ: కెమెరా ముందుకు మళ్లీ రావడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ చెప్పింది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటిస్తున్నా కెమెరా ముందుకు కొత్తగా వచ్చిన ఫీలింగ్ లేదనీ, బాలీవుడ్ ని అస్సలు మిస్పవ్వలేదంటోంది. ఇక తరచూ ఇలాగే అభిమానులకు కనువిందు చేస్తానంటోంది ఈ భామ. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ముగిసిన అమెజాన్ ఫ్యాషన్ షోలో ఐష్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి దుస్తుల్లో మెరిసిపోయింది 'జీన్స్' సుందరి. సంజయ్ గుప్త తాజా చిత్రం 'జజ్బా' తో రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐష్ ఇక ముందు తన ఫ్యాన్స్ తనను మిస్ కారని హామీ ఇస్తోంది. పెళ్లి, సంతానం కారణంగా సినిమాలకు దూరమైన ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారన్న మీడియా ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. అసలు బాలీవుడ్‌ని, అభిమానులను మిస్ అయిన భావన తనకు కలగలేదంటోంది. -
17లోగా సీఎంగా పగ్గాలు!
జయలలితను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈనెల 13న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రెండు రోజుల్లో లేదా ఈనెల 17వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు పార్టీ శాసనసభా నేతగా ఎన్నుకునేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కె.రోశయ్యకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో శుభఘడియలు ఉన్నందున జయ ప్రమాణ స్వీకారం అప్పుడే ఉంటుందని తెలుస్తోంది. -
టీచర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చంద్రముఖి