
ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్న ఫీలింగ్ లేదు..
కెమెరా ముందుకు మళ్లీ రావడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ చెప్పింది.
న్యూఢిల్లీ: కెమెరా ముందుకు మళ్లీ రావడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ చెప్పింది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటిస్తున్నా కెమెరా ముందుకు కొత్తగా వచ్చిన ఫీలింగ్ లేదనీ, బాలీవుడ్ ని అస్సలు మిస్పవ్వలేదంటోంది. ఇక తరచూ ఇలాగే అభిమానులకు కనువిందు చేస్తానంటోంది ఈ భామ.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ముగిసిన అమెజాన్ ఫ్యాషన్ షోలో ఐష్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి దుస్తుల్లో మెరిసిపోయింది 'జీన్స్' సుందరి. సంజయ్ గుప్త తాజా చిత్రం 'జజ్బా' తో రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐష్ ఇక ముందు తన ఫ్యాన్స్ తనను మిస్ కారని హామీ ఇస్తోంది. పెళ్లి, సంతానం కారణంగా సినిమాలకు దూరమైన ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారన్న మీడియా ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. అసలు బాలీవుడ్ని, అభిమానులను మిస్ అయిన భావన తనకు కలగలేదంటోంది.