అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు | There was no question of discomfort with Karan Singh Grover: Bipasha Basu | Sakshi
Sakshi News home page

అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు

Published Sat, Jan 10 2015 5:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు

అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు

ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.

ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement