నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్ | bipasha bashu rejects claims being pregnant | Sakshi
Sakshi News home page

నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్

Published Tue, Mar 28 2017 11:38 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్

నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు త్వరలోనే తల్లి కాబోతోంది అంటూ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట బిపాషా వరకు కూడా వెళ్లింది. కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకున్న బిపాషా.. ఈ వార్తలను గట్టిగా ఖండించింది. ఈ విషయమై ఆమె వరుసపెట్టి మూడు ట్వీట్లు చేసింది. తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి చాలా ఆత్రుతగా ఉందని, వాళ్ల ఆశాభావం బాగానే ఉంది గానీ, తనకు చికాకు కలిగిస్తోందని చెప్పింది. తాను గర్భం దాల్చాలని తొందర పడుతున్న వాళ్లను నిరాశ పర్చుతున్నందుకు సారీ అని తెలిపింది.

ప్రస్తుతానికి తాము పిల్లలను కనాలని ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదని, ఒకవేళ అనుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తాము తమ శ్రేయోభిలాషులతో కూడా తప్పకుండా పంచుకుంటామని చెప్పింది. అయితే ప్రతిసారీ తాను గర్భవతిని అవుతున్నానంటూ గెస్ చేయడం మాత్రం సరికాదని, తాను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తానని అంది. అందువల్ల ఈ విషయమై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement