karan singh grover
-
భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్
పాపులర్ సింగర్ మికా సింగ్.. అదుర్స్ (పిల్లా నా వల్ల కాదు..), బలుపు (పాతికేళ్ల చిన్నది), డార్లింగ్ (యాహు యాహూ..) సినిమా పాటలతో తెలుగువారికీ సుపరిచితుడయ్యాడు. టాప్ సింగర్‌గా, ర్యాపర్‌గా రాణిస్తున్న ఇతడు రెండుమూడు సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఓ సారి చిన్నపాటి సినిమా లేదా వెబ్ సిరీస్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2020వ సంవత్సరంలో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తీశాడు.రిస్క్ ఎందుకని?అయితే నిర్మాతగా ఇదే తన తొలి ప్రాజెక్ట్ కావడంతో రాజ్ సినిమా డైరెక్టర్ విక్రమ్ భట్ దగ్గరున్న కథనే సెలక్ట్ చేసుకున్నాడు. పెద్దగా రిస్క్ చేయడం ఇష్టం లేని అతడు రాజ్ సినిమాలోని కొందర్ని తన సిరీస్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. బడ్జెట్ మరీ మితిమీరిపోకూడదని భావించి కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఎంపిక చేశాడు. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలనుకున్నాడు. కానీ కరణ్ భార్య బిపాసా బసు (Bipasa Basu) తనే కథానాయికగా చేస్తానంది. దీంతో ఒప్పుకోక తప్పలేదు.దంపతులకు వేర్వేరు గదులుఇంకా మికా సింగ్ (Mika Singh) మాట్లాడుతూ.. నెల రోజుల షెడ్యూల్ కోసం 50 మంది కలిసి లండన్‌కు వెళ్లాం. తీరా వెళ్లాక అది రెండు నెలలవరకు కొనసాగింది. కరణ్, బిపాసా చాలా ఓవర్ చేశారు. వీళ్లు దంపతులే కాబట్టి ఒక రూమ్ బుక్ చేశాను. కానీ వాళ్లేమో వేర్వేరు గదులు కావాలన్నారు. నాకసలు అర్థమే కాలేదు. తర్వాత వేరే హోటల్‌కు వెళ్తామంటే అదీ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశంలో కరణ్ కాలు ఫ్రాక్చర్ అయింది. అది మనసులో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేశారు. గొంతు బాలేదు, బిజీగా ఉన్నామంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవారు. నానా రచ్చవారు చేసిన పనికి డబ్బిస్తున్నప్పుడు ఎందుకింత డ్రామా చేస్తున్నారనేది నాకసలు అంతుపట్టలేదు. ముద్దు సన్నివేశం దగ్గర కూడా నానా రచ్చ చేశారు. అందుకు ససేమీరా ఒప్పుకోమన్నారు. స్క్రిప్ట్‌లో ఈ సీన్ గురించి వివరంగా రాసుంది. అది చదివే అగ్రిమెంట్‌పై సంతకం చేశారు. పైగా ఇద్దరూ భార్యాభర్తలే అయినప్పుడు ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఇలాంటివాళ్లు ధర్మ ప్రొడక్షన్, యష్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాతలకు భజన చేస్తారు. చిన్న పాత్ర ఇచ్చినా ఆహా ఓహో అని పొంగిపోతారు.యాటిట్యూడ్ చూపించారుకానీ చిన్న నిర్మాతల దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. మేము కూడా వారిపై డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా! ఇదంతా చూశాక ఇంకోసారి నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంటాను. లేదు, కచ్చితంగా సినిమా నిర్మించాలనుకుంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఉత్తమం. నేను సినిమా తీస్తున్న విషయం తెలిసి అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెచ్చరించాడు కూడా! హీరోల సలహా లెక్కచేయలేనీకేమైనా పిచ్చిపట్టిందా? జీవితంలో ఎంతో సాధించావ్.. అలాంటిది ఇప్పుడు నటీనటుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మీ షాట్ రెడీ అయింది, రండి అని పిలుచుకుంటూ ఉంటావా? నిర్మాతగా మారితే డబ్బు పోగొట్టుకుంటావ్ అన్నాడు. సల్మాన్ ఖాన్ అయితే.. సినిమా తీయాలనుకుంటే ఓకే, కానీ అందులో నువ్వు కూడా నటించు. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసే హీరో కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అన్నాడు. ఇద్దరి మాటల్నీ నేను పట్టించుకోలేదు. నా సిరీస్ కోసం ఎంతో డబ్బు పోగేశాను.. కానీ అది ఫ్లాప్ అయింది. కనీసం అందులో నటించినా బాగుండేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అని మికా సింగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్! -
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పాప పాదాలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ' దేవి బసు సింగ్ గ్రోవర్' అంటూ రాశారు. గతంలోనే ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిపాసా బసు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసింది. తాజాగా నవంబర్ 12న బిపాసా బేబీకి జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (చదవండి: తల్లి కాబోతున్న బిపాషా బసు?!) బిపాసా, కరణ్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టులోనే ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన 'ఎలోన్' సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో డేటింగ్ కొనసాగించారు. ఆ తర్వాత ఈ జంట సుయాష్ రాయ్, నటాషా సూరి, సోనాలి రౌత్, నితిన్ అరోరా నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ కూడా కలిసి నటించారు. గతవారమే ఆలియా భట్‌కు పాప పుట్టిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) -
తల్లి కాబోతున్న బిపాషా బసు?!
తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది బిపాషా బసు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారిద్దరూ. ఇదిలా ఉంటే తాజాగా బిపాషా తల్లి కాబోతుందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. మరి బిపాషా దీనిపై ఏమంటుందో చూడాలి! View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) చదవండి: నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి.. ఓటీటీలో సందడి చేయనున్న స్టార్ హీరో మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
‘భర్తడే’ బాష్ : మాల్దీవుల్లో హాట్ భామ
సాక్షి,ముంబై: బాలీవుట్ సీనియర్ నటి బిపాసాబసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో మాల్దీవుల్లో వాలిపోయింది. కరణ్ 39వ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బిపాసా కొన్ని హాట్ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. సంవత్సరంలో తనకు అత్యంత ఇష్టమైన రెండవ రోజు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ హాట్‌భామ మాల్దీవుల్లో విహరిస్తున్న కొన్ని ఫోటోలను, బర్తడే సెలబ్రేషన్ వీడియోను షేర్ చేశారు. ‘‘లవ్ ఈజ్ఇన్ద ఎయిర్’’ "నీరు ఆకాశం కలిసే చోట’’ నువ్వూ నేను, మంకీ లవ్ హ్యాష్ ట్యాగ్‌లను జోడిస్తూ, భర్తతో కలిసివున్న ఫోటోలు, స్విమ్ సూట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లవ్ బర్డ్స్‌పై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) -
భర్తతో హీరోయిన్ హాట్ యోగాసనాలు!
బాలీవుడ్ దంపతులు బిపాషా బస్సు-కరణ్ సింగ్ గ్రోవర్‌కు ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. నిత్యంలో ప్రేమలో మునిగిపోయే ఈ జంట తాము ఫిట్నెస్ కోసం చేసే వర్కౌట్స్‌ను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. అంతర్జాతీయ మూడో యోగా దినోత్సవం సందర్భంగా బిపాషా-కరణ్ జంటగా కొన్ని ప్రత్యేక ఆసనాలు వేశారు. ఇద్దరూ కలిసి జోడీగా చేసిన ఈ ఆసనాలు ఫొటోలు ఒకింత హాట్‌గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. -
నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు త్వరలోనే తల్లి కాబోతోంది అంటూ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట బిపాషా వరకు కూడా వెళ్లింది. కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకున్న బిపాషా.. ఈ వార్తలను గట్టిగా ఖండించింది. ఈ విషయమై ఆమె వరుసపెట్టి మూడు ట్వీట్లు చేసింది. తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి చాలా ఆత్రుతగా ఉందని, వాళ్ల ఆశాభావం బాగానే ఉంది గానీ, తనకు చికాకు కలిగిస్తోందని చెప్పింది. తాను గర్భం దాల్చాలని తొందర పడుతున్న వాళ్లను నిరాశ పర్చుతున్నందుకు సారీ అని తెలిపింది. ప్రస్తుతానికి తాము పిల్లలను కనాలని ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదని, ఒకవేళ అనుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తాము తమ శ్రేయోభిలాషులతో కూడా తప్పకుండా పంచుకుంటామని చెప్పింది. అయితే ప్రతిసారీ తాను గర్భవతిని అవుతున్నానంటూ గెస్ చేయడం మాత్రం సరికాదని, తాను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తానని అంది. అందువల్ల ఈ విషయమై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది. The curiosity about me being pregnant...is sweet and a tad annoying. I am sorry to disappoint the ppl who are so eager for this to happen. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 We are not planning to have a baby right now.When we do plan..it will be joyous news which we will share with our well wishers then. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 The constant guessing game is tiring..as am more than straightforward person.So pls do not believe anything that gets written.Thank you all. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 -
ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..
ముంబయి: ఇటీవల పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బాలీవుడ్ జోడీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఏప్రిల్ 30న బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల పాటు హనీమూన్ కు వెళ్లి, అక్కడ దిగిన ఫొటోలను నెట్ లో పెట్టి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాపులర్ కామెడీ ఈవెంట్ 'ద కపిల్ శర్మ షో' లో నూతన దంపతులు పాల్గొన్నారు. అయితే బిపాసకు సగటు భార్య చేసే పనులు ఏవైనా తెలుసా.. లేదా అని ఆడియన్స్ ఆమెకు పరీక్ష పెట్టారు. వారితో పాటు భర్త కరణ్ కూడా ఆమెను కాస్త ఆటపట్టించాడు. ఇంట్లో ఏమేం పనులు చేస్తారని అభిమానులు అడగగా వాటికి సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీ భర్త షర్ట్ కు ఎప్పుడైనా బటన్ కుట్టారా అని మరో ప్రశ్న సంధించారు. తన భర్తకే కాదు ఎవరి డ్రెస్ కు బటన్స్ కుట్టను. ఎందుకంటే స్టిచింద్ వర్క్ రాదని అసలు విషయాన్ని చెప్పింది. అభిమానుల ఇచ్చిన ఉత్సాహంతో బిపాసను కరణ్ కూడా టెస్ట్ చేశాడు. టై కట్టమని ఆర్డర్ వేయగా, బిపాస మొత్తానికి భర్తకు టై అడ్జస్ట్ చేసింది. భార్య టై కడుతున్నప్పుడు దర్జాగా హోదాలో ఉన్నట్లుగా ఫీలవుతూ కరణ్ కాసేపు నవ్వుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, భర్త బిపాసకు పరీక్ష పెట్టినట్లయింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఓ స్క్రీన్ మీద కనిపించడం ఇదే తొలిసారి. -
హనీమూన్: రాళ్లలో, ఇసుకల్లో..
'రాళ్లలో ఇసకల్లో రాసాము ఇద్దరిపేర్లు.. కళ్ళు మూసి తిన్నగ కలిపి చదువుకో ఒక్కసారి' అని జాలీగా పడుకుంటూ హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది బిపాసా బస్సు, కరణ్ సింగ్ గ్రోవర్ జంట. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట మాల్దీవుల్లో ప్రస్తుతం హనీమూన్‌లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సముద్రం కెరటాల్లో, ఇసుక తిన్నెల్లో, సంధ్యసాయంత్రాల్లో హాయిహాయిగా గడిచిపోతున్న తమ హనీమూన్ గురించి ఎప్పటికప్పుడు ఈ కొత్త జంట సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తోంది. ఆ ఫొటోలనూ పంచుకుంటోంది. వారి డ్రీమీ ఫొటోలు అభిమానుల్ని కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ జంట ఇసుకలో రాళ్లతో తమ పేరు రాసుకొని మురిసిపోయింది. నీలిసముద్ర తీరంలో తెల్లని గులకరాళ్లతో 'మంకీ లవ్ <3' అని రాసి ఆ వీడియోను తాజాగా బిపాసా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇంతకు మంకీ అంటే తెలియదా? 'మంకీలవ్' హ్యాష్‌ట్యాగ్‌తోనే తమ పెళ్లిఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మంకీ' అనేది ఈ జంట నిక్‌నేమ్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో బిపాసా అందమైన హనీమూన్ ఫొటోలను, హాట్ బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
హనీమూన్: నా భార్య దేవత అంటున్న హీరో
'నా భార్య దేవత' అంటూ బాలీవుడ్ నటి బిపాషా బస్సును ఆమె భర్త కరణ్‌సింగ్ గ్రోవర్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ కొత్తజంట ఇప్పుడు హనీమూన్‌లో మునిగితేలుతోంది. అందమైన సముద్రతీరమైన మాల్దీవుల్లో తమ వైవాహిక జీవితపు తొలినాళ్లను ఎంజాయ్ చేస్తున్నది. సముద్ర ఒడ్డున ఇసుకలో తమ హనీమూన్ సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నది ఈ జంట. తాజాగా కరణ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భార్య బిపాషా ఫొటోను పెట్టి.. 'నా భార్య దేవత. నేను అదృష్టవంతుడిని కాక మరేమిటి' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిని రీపోస్టు చేసిన బిపాషా.. 'థాంక్యూ హాటీ.. బోథ్ గాట్ లక్కీ' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందమైన సముద్రం ఒడ్డున హనీమూన్‌లో సేదదీరుతున్న ఈ జంట తమ అనుభూతులకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పడు అభిమనులతో పంచుకుంటున్నారు. -
నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్
ముంబై: నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కరణ్-బిపాసా శనివారం సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు సినిమా తారలు హాజరయ్యారు. రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన వారు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. ప్రియాంక చోప్రా: కంగ్రాట్యులేషన్స్ బిపాసా-కరణ్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. మీకు వివాహ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసుండాలని ఆకాంక్షిస్తున్నాను. అభిషేక్ బచ్చన్: బిపాసా-కరణ్ లకు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఒక్కటవడం ఆనందదాయకం. వివాహితుల క్లబ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా. శిల్పాషెట్టి: పరస్పర విశ్వాసం, ప్రేమ, స్నేహం, సెలబ్రేషన్ తో బిపాసా-కరణ్ వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. మధు బండార్కర్, షమితా షెట్టి, ఫరాఖాన్, విశాల్ పాండ్యా, రమేశ్ తౌరణి తదితరులు బిపాసా-కరణ్ దంపతులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
మాజీ భర్తకు పెళ్లి విషెష్ చెప్పిన నటి
తన మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లిపై బాలీవుడ్ నటి జెన్నిఫర్ వింగెట్ మౌనం వీడింది. హారర్ క్వీన్ బిపాసా బసును పెళ్లాడబోతున్న కరణ్ కు ఆమె విషెస్ చెప్పింది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది. బిపాసా, కరణ్ శనివారం(ఏప్రిల్ 30) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాసా-కరణ్ పెళ్లి గురించి జెన్నిఫర్ ను అడగ్గా... 'ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనసులు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వారికి దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమ అనేది ఓ అద్భుతం. ఎవరిపైన అయిన మనకు ప్రేమ పుడితే అది గొప్ప విషయమే' అని బదులిచ్చింది. కాగా, జెన్నిఫర్ ను పెళ్లి చేసుచేసుకుని తప్పు చేశానని కరణ్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన అతడు ఇప్పుడు బిపాసాతో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యాడు. -
మిస్ టు మిసెస్
ఈ ఇద్దరి పెళ్లి జరుగుతుందా? లేదా? అంటూ గత కొంత కాలంగా నటి బిపాసా బసు, కరణ్‌సింగ్ గ్రోవర్ గురించి బాలీవుడ్లో చర్చలు జరిగాయి. ‘అలోన్’ చిత్రంలో నటించి నప్పుడు ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బాలీవుడ్లో ఇలా ప్రేమలో పడే నటీనటులు చాలామందే ఉంటారు. దాదాపు మధ్యలోనే విడిపోతారు. ఈ జంట కూడా అంతే అనుకున్నారు. కానీ, బిపాసా, కరణ్ తమ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించాలనుకున్నారు. ఈ నెల 30న వీరిద్దరూ బెంగాలీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉంది కాబట్టి, దానికి సంబంధించిన వేడుకలు మొదలుపెట్టేశారు. ఆదివారం బిపాసా ఇంట్లో ‘బ్రైడల్ షవర్’ జరిగింది. దీనికి చాలామంది అతిథులును ఆహ్వానిస్తారు. కాబోయే పెళ్లి కూతురికి బహుమతులిస్తారు. పట్టుచీర కట్టి, మంగళ స్నానం చేయించి ఉంటారేమో అనుకునేరు. అదేం లేదు.. చాలా మోడర్న్‌గా ఈ తతంగాన్ని జరుపుతారు. బిప్స్ పాశ్చాత్య దుస్తుల్లో మెరిశారు. విందు, మందుతో ఈ పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. మరోవైపు... కరణ్‌సింగ్ గ్రోవర్ తన స్నేహితులతో గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ‘బ్రైడల్ షవర్’ సందర్భంగా బిప్స్ ‘మిస్ టు మిసెస్’ అనే ప్లకార్డ్‌తో ఆనందం వ్యక్తపరిచారు. -
పిలువకున్నా పెళ్లికెళ్తానంటున్న బాయ్ ఫ్రెండ్!
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ల వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మరో 17 రోజుల్లో నా వివాహం అంటూ పేద్ద లవ్ కోట్‌ను కూడా బిపాసా గురువారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక్క జాన్ అబ్రహంతో తప్ప తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇప్పటికీ మంచి రిలేషన్‌ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. ఈ వివాహా ఉత్సవానికి వీరిని ఆహ్వానించి కరణ్ మనసు నొప్పించాలనుకోవడంలేదట. అయినప్పటికీ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ డినో మోరియా మాత్రం పెళ్లికి వెళ్తానని మంకు పట్టు పడుతున్నాడు. బిప్స్ పిలువకపోయినా సరే వెళ్లి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుందో ఏమో బిపాసానే డినోను ఆహ్వానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలకు వెళ్లడానికి డినో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ నందితా మెహతాని కూడా సిద్ధమౌతోందట. కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తన ఈ మూడో పెళ్లి వేడుకలకు అతని మాజీ భార్యలైన శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింజెట్లను ఆహ్వానించడం లేదటలెండి. -
ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి
బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. అసిన్, ప్రీతి జింటా, ఊర్మిళ.. ఇప్పుడు బిపాసా బసు. గత కొన్ని రోజులుగా బిపాసా బసు.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లాడబోతుందంటూ వినిపించిన వార్తలు త్వరలో నిజం కానున్నాయి. బిపాసా, కరణ్‌ల వివాహం ఏప్రిల్ 30వ తేదీన జరుగనుందని అధికారిక సమాచారం. అయితే పెళ్లి వధూవరులకు అత్యంత సన్నిహితులైనవారి మధ్య జరగనుంది. 2015లో రిలీజ్ అయిన హారర్ సినిమా 'ఎలోన్'లో కలిసి నటించినప్పటి నుంచి బిపాసా, గ్రేవర్ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28న మెహందీ ఫంక్షన్, 29న రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులను, స్నేహితులను ఆహ్వానించనున్నారు. పెళ్లికి మాత్రం అత్యంత సన్నిహితులే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా బిపాషా పెళ్లి వార్త తెలియగానే మరో బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్నేహితురాలికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. I'm truly so happy for my friend @bipsluvurself n her handsome bridegroom to be @Iamksgofficial Ure a golden heart..u deserve so much n more — PRIYANKA (@priyankachopra) 7 April 2016 -
పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్‌ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బిపాసా, కరణ్‌కు నిశ్చితార్థం అయిందని, ఏప్రిల్ 30న ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన బిపాసాను మీడియా ప్రతినిధులు పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. పెళ్లి ఎప్పుడు జరిగితే, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పింది. కాగా కరణ్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నాడు. -
ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ప్రియుడు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. కరణ్ తల్లి ఈ డస్కీ బ్యూటీని కోడలుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదికలను ధ్రువీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 30న ముంబైలోని సబర్మన్ హెటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిబాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సొట్టబుగ్గల సుందరి, ప్రీతి జింటా, ఊర్మిళ పెళ్లిచేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇపుడు బిపాసా కూడా నెలరోజుల్లోనే రియల్ లైఫ్‌లో పెళ్లికూతురుగా అవతరించబోతోందన్నమాట. ఇటీవల బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమ్యాయి. వాళ్లిద్దరికి ఎంగేజిమెంట్ కూడా అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో బిపాసా, కరణ్‌ల వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందని బీ టౌన్ లో వార్తలు హల్చల్ చేశాయి. ప్రియుడి పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేసిన భామ ఆ ఫొటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇవన్నీ గాసిప్స్ అని బిపాసాబసు గతంలో కొట్టిపారేసింది. ఈ వ్యవహారాన్ని హాట్ టాపిక్‌గా మార్చొద్దంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను రిక్వెస్ట్ చేసింది. కాగా కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొన్నాడు. మరి ఈ సస్సెన్స్‌కు తెరపడాలటే... బిపాసా బసు నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. -
'నా పెళ్లిని హాట్ టాపిక్ చేయవద్దు'
గత కొన్ని రోజుల కిందట సాగర తీరంలో రొమాన్స్ చేస్తూ బాలీవుడ్ తార బిపాషాబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ దిగిన ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరిగింది. తాజాగా బిపాషాబసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల వివాహం జరిగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కనీసం వారికి ఎంగేజ్ మేంట్ అయినా అయ్యుంటుంది అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై బిపాషా కాస్త ఘాటుగానే స్పందించింది. తన పెళ్లి, జీవితం గురించి కొన్ని వివరాలు చెబుతూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి ఇప్పుడే నిర్ణయానికి రాలేదని, ఇది తన జీవితమని అంటోంది. తనను ప్రేమించేవాళ్లకు ఇది తన విజ్ఞప్తి అంటూ ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయవద్దని కోరింది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానంది. తమ వ్యవహారాన్ని హాట్ టాపిక్ గా మారుస్తున్నారని చెప్పింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకుంటే ఆ విషయాన్ని మీకు కచ్చితంగా చెబుతాను అని పేర్కొంది. అయిస్తే కాస్త ఓపిక పట్టాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఈ అమ్మడు. తనకు సహకరించేవారికి ధన్యవాదాలు అంటూ ట్విట్ లో రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ నటి. గతంలో జాన్ అబ్రహాంతో ఓ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతడి నుంచి విడిపోయింది బిపాషా. జాన్‌తో ఉన్నట్లు కాకపోయినా ఆ తర్వాత హర్మన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి అతడికి గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే కరణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. Wait for me 2announce my wedding when I want to n if I want to.Please stop treating it frivolously. — Bipasha Basu (@bipsluvurself) March 6, 2016 For years I have dealt with this constant discussion.Please be patient. After all it's my life:) Thank you all. — Bipasha Basu (@bipsluvurself) March 6, 2016 -
ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!
సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్‌తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు. సో.. బిపాసా ఈ హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు. చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్‌ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే. -
సాగర తీరంలో సరసాలు!
కొన్ని విషయాలు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరంలేదు.. సైగల ద్వారానో, ఫొటోల రూపంలోనే చెప్పేయొచ్చు. ఫొటోల్లో ఉన్న పోజులను బట్టి, అందులో ఉన్నవారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ఊహించేయొచ్చు. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్తో తాను కలిసి దిగిన ఫొటోలను బయటపెట్టడం ద్వారా తమ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పీ చెప్పక చెప్పేశారు బిపాసా బసు. 2015కి వీడ్కోలు పలుకుతూ చివరి రోజున కరణ్ సింగ్, బిపాసా సాగర తీరంలో చేతిలో చెయ్యేసుకుని మరీ ‘స్వీట్ నథింగ్స్’ చెప్పుకున్నారు. అలాగే, ఈత కొట్టి సరసాలాడారు. ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఆ ఫొటోలను బిపాసా తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ‘‘2015 నాకు చాలా స్పెషల్. ఓర్పుగా ఉండటం, ప్రేమించడం, ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మడం.. ఇవన్నీ నేర్పించింది. అన్నింటికన్నా మించి నా జీవితంలో సంతోషాన్ని నింపింది’’ అని బిపాసా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ మధ్య కరణ్‌తో బిపాసా అనుబంధం చెడిందనే వార్త వచ్చినప్పటికీ, ఈ ఫొటోల ద్వారా ఇద్దరూ బాగానే ఉన్నారని స్పష్టమైంది. -
రెస్టారెంట్లో రచ్చ.. రచ్చ...
ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న వార్తల్లో బిపాసా బసుకి సంబంధించిన వార్త ఒకటి. ఈవిడగారు ఓ రెస్టారెంట్లో చేసిన రచ్చ గురించి అందరూ చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే... తాజా ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బిపాసా ఓ రెస్టారెంట్‌కి వెళ్లారట. అక్కడ లైట్‌గా మద్యం కూడా పుచ్చుకున్నారట. ఆ మాత్రానికే బిపాసా నిషాతో గట్టి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారని బోగట్టా. కరణ్ సింగ్ గ్రోవర్ ఆమెను కంట్రోల్ చేయడానికి నానా పాట్లు పడ్డారని సమాచారం. ‘బిపాసా కంట్రోల్ యువర్ సెల్ఫ్’ అని వార్నింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. చేసేదేం లేక బిపాసాను అర్జంటుగా కరణ్ అక్కణ్ణుంచి తీసుకెళ్లారని చూసినవాళ్లు చెప్పుకుంటున్నారు. ఈ తతంగం ఆ నోటా ఈ నోటా వీర విహారం చేస్తోందట. -
మూతి వాచి పోయింది!
అయ్యో పాపం... ఎలా మ్యానేజ్ చేస్తుందో ఏంటో? అని ‘హేట్ స్టోరీ 3’ చిత్రబృందం జరీన్ ఖాన్‌ను చూసి తెగ జాలిపడిపోయింది. ఈ థ్రిల్లర్ మూవీలో జరీన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. కరణ్‌సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషీ కథానాయకులు. కరణ్, జరీన్ ఓ జంట కాగా, షర్మాన్ సరసన డైసీ షా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కరణ్, జరీన్ పాల్గొనగా ఓ ముద్దు సన్నివేశం చిత్రీకరించాలనుకున్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి జరీన్ జంకలేదు కానీ, ఆమె పెదవుల పరిస్థితే బాగాలేదట. పంటికి సంబంధించిన సమస్యకు చికిత్స చేయించుకున్న కారణంగా జరీన్ మూతి వాచిపోయింది. ఆ మూతితో ముద్దు సీన్ ఎలా చేస్తారో అని యూనిట్ సభ్యులు ఓ వైపు జాలిపడుతూనే, మరోవైపు ఆసక్తిగా తిలకించారట. ఈ పెదవి ముద్దు సీన్ తీస్తున్నప్పుడు ఆమె బాధతో విలవిల్లాడిపోయారట. ఆ బాధకు జరీన్ కళ్లు చెమర్చడం గమనించగానే చిత్ర దర్శకుడు విశాల్ పాండ్య కట్ చేప్పేశారట. జరీన్ కొంచెం తేరుకున్నాక మళ్లీ తీశారట. మొత్తం మీద కుర్రకారును గిలిగింతలు పెట్టే ఈ సీన్ చేయడానికి జరీన్ చాలా పాట్లు పడ్డారని సమాచారం. ఎలాగో సీన్ ముగించుకుని, హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారామె. -
అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!
గాసిప్ జాన్ అబ్రహాంతో పదేళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత విడిపోయిన బిపాషా బసు ఇప్పుడు బుల్లితెర ఫేం కరణ్ సింగ్ గ్రోవర్తో ప్రేమ విహారాల్లో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కరణ్ సింగ్‌తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారామె. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఈ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనని కొందరు జోక్‌లు వేసుకుంటున్నారు. కరణ్‌తో బిపాషా వ్యవహారం ఆమె తల్లికి ఏ మాత్రం రుచించట్లేదట. దీనికి కారణం లేకపోలేదు. కరణ్ సింగ్ ఇప్పటి వరకూ శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింగెట్లను పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బిపాషాతో ప్రేమను ఆస్వాదిస్తున్నారు కరణ్. ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న కరణ్ సింగ్ గ్రోవర్తో కూతురు అంత చనువుగా ఉండటాన్ని బిపాషా తల్లి ఏ మాత్రం సహించలేకపోతున్నారట. కూతురి మీద ఫైర్ అయ్యారని సమాచారం. దాంతో కరణ్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని, వేరే ఏమీ లేదని తల్లికి వివరణ ఇచ్చుకున్నారట బిపాషా. ఏదో తల్లిని కూల్ చేయడానికి అలా అని ఉంటుందని ఈ తల్లీ కూతుళ్లు గిల్లికజ్జాలు తెలిసినవాళ్లు అంటున్నారు. -
ఆన్లైన్ లాటరీ స్కాంలో మోసపోయిన హీరో
ముంబై: ఆన్లైన్ లాటరీ స్కాం బాధితుల్లో బాలీవుడ్ కరణ్ సింగ్ గ్రోవర్ చేరారు. 5.6 లక్షల రూపాయలు మోసపోయినట్టు కరణ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్‌కు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందంటూ ఓ ఈమెయిల్ వచ్చింది. ఈ డబ్బు తీసుకునే ప్రక్రియలో భాగంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లించాలని లాటరీ నిర్వాహకులు కోరారు. కరణ్ వారికి 5.60 లక్షలు చెల్లించారు. అయితే తనకు లాటరీ డబ్బును పంపలేదని, సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అందుబాటులోకిరాలేదని కరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ చిత్రం అలోన్లో కరణ్, బిపాసా బసు సరసన నటించారు. -
అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు
ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్‌తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది.