ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి | Priyanka Chopra accidentally confirmed Bipasha the wedding | Sakshi
Sakshi News home page

ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి

Published Thu, Apr 7 2016 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి

ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి

బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. అసిన్, ప్రీతి జింటా, ఊర్మిళ.. ఇప్పుడు బిపాసా బసు. గత కొన్ని రోజులుగా బిపాసా బసు.. నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ని పెళ్లాడబోతుందంటూ వినిపించిన వార్తలు త్వరలో నిజం కానున్నాయి. బిపాసా, కరణ్ల వివాహం ఏప్రిల్ 30వ తేదీన జరుగనుందని అధికారిక సమాచారం. అయితే పెళ్లి వధూవరులకు అత్యంత సన్నిహితులైనవారి మధ్య జరగనుంది. 2015లో రిలీజ్ అయిన హారర్ సినిమా 'ఎలోన్'లో కలిసి నటించినప్పటి నుంచి బిపాసా, గ్రేవర్ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ  చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. 
 
ఏప్రిల్ 28న మెహందీ ఫంక్షన్, 29న రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్కు బాలీవుడ్ ప్రముఖులను, స్నేహితులను ఆహ్వానించనున్నారు. పెళ్లికి మాత్రం అత్యంత సన్నిహితులే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా బిపాషా పెళ్లి వార్త తెలియగానే మరో బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్నేహితురాలికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement