ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి? | Bipasha Basu, Karan Singh Grover’s wedding date finalised? | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?

Published Tue, Mar 29 2016 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?

ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ప్రియుడు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్‌ కోడై కూస్తోంది. కరణ్ తల్లి ఈ డస్కీ బ్యూటీని కోడలుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదికలను ధ్రువీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 30న ముంబైలోని సబర్మన్ హెటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిబాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సొట్టబుగ్గల సుందరి,  ప్రీతి జింటా, ఊర్మిళ పెళ్లిచేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇపుడు బిపాసా కూడా నెలరోజుల్లోనే రియల్ లైఫ్‌లో పెళ్లికూతురుగా అవతరించబోతోందన్నమాట.

ఇటీవల  బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమ్యాయి. వాళ్లిద్దరికి ఎంగేజిమెంట్ కూడా అయిపోయిందనే వార్త  సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో బిపాసా, కరణ్‌ల వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందని బీ టౌన్ లో వార్తలు హల్‌చల్ చేశాయి.  ప్రియుడి పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేసిన భామ ఆ ఫొటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇవన్నీ గాసిప్స్ అని బిపాసాబసు గతంలో కొట్టిపారేసింది. ఈ వ్యవహారాన్ని హాట్ టాపిక్‌గా మార్చొద్దంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను రిక్వెస్ట్ చేసింది. కాగా కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొన్నాడు. మరి ఈ సస్సెన్స్‌కు తెరపడాలటే... బిపాసా బసు నుంచి  అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్  చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement