April 30
-
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఈ నెల 30వ తేదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు గురువారం శాసనసభ వ్యవహారల కార్యదర్శి రాజా సదరాం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ వివరాలను గవర్నర్, ముఖ్యమంత్రుల ప్రిన్సిపల్ కార్యదర్శులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులకు అందించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ(7వ సెషన్, మూడో సమావేశం), మధ్యాహ్నం 3 గంటలకు మండలి సమావేశం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. సమావేశాలకు ముందు రోజు ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరుగనుంది. ప్రత్యేక సమావేశంలో ఆమోదించే బిల్లులపై విపక్ష పార్టీల నేతలకు బీఏసీలో వివరించి వారి సహకారం కోరే అవకాశం ఉంది. ఇక ప్రత్యేక సమావేశంలో గత ఏడాది డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ బిల్లులో కేంద్రం సూచించిన సవరణలపై చర్చించి మార్పులతో తిరిగి బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. దీంతో పాటే తెలంగాణ రాష్ట్ర నకిలీ విత్తన నిరోధక చట్టం బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రైతుల్ని తీవ్రంగా నష్ట పరుస్తున్న నకిలీ విత్తనాల విక్రయంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురానున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశంలోనే ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. -
గరీబ్ యోజన డిపాజిట్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్ గడువును ప్రభుత్వం, ఆర్బీఐలు బుధవారం ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించాయి. ఈ మేరకు రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ఇంతక్రితం ఈ గడువు మార్చి 31. ఈ పథకం కింద తమ నల్లధనాన్ని వెల్లడించిన వ్యక్తులు అందులో 25 శాతాన్ని ఎటువంటి వడ్డీలేకుండా నాలుగేళ్లపాటు డిపాజిట్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిపాజిట్లకు సంబంధించి ఏప్రిల్ 30 తరువాత మాత్రం గడువు పొడిగించేది లేదని ఒక ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. తాజా నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ ఈ–కుబేర్ సిస్టమ్‌లో వివరాలను పొందుపరచడానికి గడువును బ్యాంకులకు సైతం ఏప్రిల్ 30 వరకూ పొడిగించినట్లు ఆర్బీఐ పేర్కొంది. నవంబర్ 8 డీమోనిటైజేషన్ అనంతరం డిసెంబర్ 17న గరీబ్ యోజన పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వినియోగించుకుని పన్ను చెల్లింపు, జరిమానాల (మొత్తం కలిపి ప్రకటించిన నల్లధనం మొత్తంలో 49.9 శాతం వరకూ) ద్వారా నల్లధనానికి సంబం ధించి ప్రాసిక్యూషన్ ఎదుర్కొనకుండా బయట పడవచ్చని కేంద్రం ప్రకటించింది. -
వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాంబ్ షెల్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ల వెడ్డింగ్ కార్డు నెట్లో చక్కర్లు కొడుతోంది. కరణ్ వీరాభిమాని ఒకరు ఈ పెళ్లికార్డును నెట్లో పోస్ట్ చేశారు. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసమ్ లుక్ లో అదిరిపోతున్న ఈ పెళ్లిపత్రికకు ఫ్యాన్స్ లైక్ లు, షేర్లు జోరుగా సాగుతున్నాయి. ఈమధ్య కాలంలో హల్ చల్ చేసిన పెళ్లివార్తలను ఇద్దరూ ధ్రువీకరించడంతో బీ టౌన్లో పెళ్లిసందడి షురూ అయింది. అందరితో శుభవార్త పంచుకునేందుకు సంతోషిస్తున్నామంటూ ఈ ప్రేమపక్షులు ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 30 తమ జీవితాల్లో విశేషమైన రోజని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు తమ వివాహం ఒక ప్రైవేట్ వ్యవహారమని, దయచేసి గోప్యతను గౌరవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా మోడల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిపాసా బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో కరణ్‌తో ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు నడిపిస్తోంది. వీరిద్దరూ ఈనెల 30న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కి ఇది మూడో పెళ్లి కాగా, బిపాసా బసుకు మాత్రం మొదటి పెళ్లి . సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. -
ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ప్రియుడు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. కరణ్ తల్లి ఈ డస్కీ బ్యూటీని కోడలుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదికలను ధ్రువీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 30న ముంబైలోని సబర్మన్ హెటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిబాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సొట్టబుగ్గల సుందరి, ప్రీతి జింటా, ఊర్మిళ పెళ్లిచేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇపుడు బిపాసా కూడా నెలరోజుల్లోనే రియల్ లైఫ్‌లో పెళ్లికూతురుగా అవతరించబోతోందన్నమాట. ఇటీవల బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమ్యాయి. వాళ్లిద్దరికి ఎంగేజిమెంట్ కూడా అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో బిపాసా, కరణ్‌ల వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందని బీ టౌన్ లో వార్తలు హల్చల్ చేశాయి. ప్రియుడి పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేసిన భామ ఆ ఫొటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇవన్నీ గాసిప్స్ అని బిపాసాబసు గతంలో కొట్టిపారేసింది. ఈ వ్యవహారాన్ని హాట్ టాపిక్‌గా మార్చొద్దంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను రిక్వెస్ట్ చేసింది. కాగా కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొన్నాడు. మరి ఈ సస్సెన్స్‌కు తెరపడాలటే... బిపాసా బసు నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
అచ్చంపేట : మండలంలోని కొండూరు కొండ ప్రాంతాల్లో బుధవారం ఇంట్లో నుంచి 50 రోజుల కిందట వెళ్లిపోయిన యువకుడి పుర్రె, ఎములకు గుర్తించారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన గరటా రవితేజ (16) తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30 రాత్రి ఎనిమిది గంటలకు తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అదేరోజు రాత్రి 10:15కు కొండూరుకు చెందిన పులి వీరంరాజు కుమారుడు గోపీకృష్ణ ఫోను చేసి రవితేజ ఉన్నాడా అని అడిగాడని, విషయం ఏమిటని అడిగేంతలో ఫోను పెట్టేశాడని చెప్పాడు. ఆ తరువాత తమ కుమారుడి కోసం వెతకని చోటు లేదని, బంధువులు, స్నేహితులు అందరిని విచారించి సమాచారం దొరకకపోవడంతో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, మరో రెండు రోజులు చూడు మీ అబ్బాయి తప్పక వస్తాడని చెప్పారని తెలిపారు. అవశేషాలు లభించిన ప్రదేశంలో మృతుడి పుర్రె, ఎముకలు, మిగిలిన అవశేషాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతుని చొక్కా, ప్యాంటు, చెప్పులు పడి ఉన్నాయి. అవి తమ పిల్లవాడివేనని తల్లిదండ్రులు గుర్తించారు. అక్కడే పురుగుమందు బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అచ్చంపేట ఎస్ఐ అనిల్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ చేపట్టారు. పుర్రె, ఎముకలను సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. ముమ్మాటికీ హత్యే : మృతుడి తండ్రి మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దొడ్లేరు పాలకేంద్రంలో పాలు పోయించుకుంటానని, తమ కుమారుడు సత్తెనపల్లిలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడని, గోపీకృష్ణ కూడా అదే కాలేజీలోనే చదివాడని తెలిపాడు. తమ పిల్లవాడు పాసయ్యాడని, గోపీకృష్ణ తప్పి ఇంట్లో పాసైనట్లు చెప్పాడని ఈ క్రమంలో ఏదైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించాడు. -
విభజన పనులకు ఏప్రిల్ 30 డెడెలైన్
-
ఏప్రిల్ 30 నాటికి విభజన ప్రక్రియ పూర్తి: గవర్నర్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఉన్నతాధికారులతో ఈరోజు గవర్నర్ సమీక్షించారు. శాసనసభ, శాసన మండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేటాయింపునకు సంబంధించి స్పీకర్, చైర్మన్లతో చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశం పారదర్శికంగా ఉండాలన్నారు. అవసరమైతే స్వయంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. విభజన వల్ల తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. జంట నగరాల్లో అక్రమ నీటి సరఫరా విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామల్లో తాగునీటి కొరతలేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.