వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్ | Bipasha Basu-Karan Singh Grover's wedding invite is OUT! See inside | Sakshi
Sakshi News home page

వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్

Published Fri, Apr 8 2016 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

వాళ్ల వెడ్డింగ్ కార్డ్  హల్ చల్

వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్

న్యూఢిల్లీ: బాలీవుడ్ బాంబ్ షెల్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్‌ల వెడ్డింగ్ కార్డు నెట్లో చక్కర్లు కొడుతోంది. కరణ్ వీరాభిమాని ఒకరు ఈ పెళ్లికార్డును నెట్‌లో పోస్ట్ చేశారు. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసమ్ లుక్ లో అదిరిపోతున్న ఈ పెళ్లిపత్రికకు ఫ్యాన్స్  లైక్ లు, షేర్లు జోరుగా సాగుతున్నాయి.

ఈమధ్య కాలంలో హల్ చల్ చేసిన పెళ్లివార్తలను ఇద్దరూ ధ్రువీకరించడంతో బీ టౌన్‌లో పెళ్లిసందడి షురూ అయింది. అందరితో శుభవార్త పంచుకునేందుకు సంతోషిస్తున్నామంటూ ఈ ప్రేమపక్షులు ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 30 తమ జీవితాల్లో విశేషమైన రోజని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు తమ వివాహం ఒక ప్రైవేట్ వ్యవహారమని, దయచేసి గోప్యతను గౌరవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు.

కాగా మోడల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన  బిపాసా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో కరణ్‌తో ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు నడిపిస్తోంది. వీరిద్దరూ ఈనెల 30న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కి ఇది మూడో పెళ్లి కాగా, బిపాసా బసుకు మాత్రం మొదటి పెళ్లి . సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement