wedding invite
-
ఇద్దరమ్మాయిలకు పెళ్లి.. ఒబామాకు ఆహ్వానం
అమెరికాలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెడ్డింగ్ కార్డులు సహా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తమ పెళ్లికి రావాలంటూ ఏకంగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆహ్వానం పంపారు. వినడానికి వింతగా ఉన్నా.. ప్రపంచంలో సేమ్ సెక్స్ వివాహాలు చేసుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చెల్సియా రోడెన్, లిసా హిర్ష్పెక్ అనే అమ్మాయిలు లవ్‌లో పడ్డారు. నాలుగేళ్లుగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంటకు ఒబామాకు ఆహ్వానం పంపాలని అనిపించింది. వెడ్డింగ్ కార్డును వైట్‌హౌజ్‌కు అయితే పంపారు కానీ ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైట్‌హౌజ్ నుంచి లేఖ రావడంతో షాకయ్యారు. 'వివాహం చేసుకోబోతున్న మీకు అభినందనలు. ఈ ప్రత్యేక సమయంలో సంతోషంతో, ప్రేమతో గడపాలని కోరుకుంటున్నాం. మీ జీవిత ప్రయాణంలో మీకు మంచి జరగాలని, ఇద్దరి బంధం మరింత దృఢపడాలని ఆకాంక్షిస్తున్నాం' అంటూ ఒబామా దంపతులు పంపిన లేఖలో అభినందనలు తెలిపారు. ఈ లేఖపై ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా సంతకాలు చేశారు. ఈ లేఖ చూడగానే సంబరం, ఆశ్చర్యానికి గురైంది రోడెన్. దీని ఫొటో తీసి, జర్మనీలో ఉన్న లిసా హిర్ష్పెక్కు పంపింది. రోడెన్ తమ ఇద్దరి ఫొటోలతో పాటు వెడ్డింగ్ కార్డు, ఒబామా దంపతులు పంపిన లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. -
వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాంబ్ షెల్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ల వెడ్డింగ్ కార్డు నెట్లో చక్కర్లు కొడుతోంది. కరణ్ వీరాభిమాని ఒకరు ఈ పెళ్లికార్డును నెట్లో పోస్ట్ చేశారు. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసమ్ లుక్ లో అదిరిపోతున్న ఈ పెళ్లిపత్రికకు ఫ్యాన్స్ లైక్ లు, షేర్లు జోరుగా సాగుతున్నాయి. ఈమధ్య కాలంలో హల్ చల్ చేసిన పెళ్లివార్తలను ఇద్దరూ ధ్రువీకరించడంతో బీ టౌన్లో పెళ్లిసందడి షురూ అయింది. అందరితో శుభవార్త పంచుకునేందుకు సంతోషిస్తున్నామంటూ ఈ ప్రేమపక్షులు ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 30 తమ జీవితాల్లో విశేషమైన రోజని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు తమ వివాహం ఒక ప్రైవేట్ వ్యవహారమని, దయచేసి గోప్యతను గౌరవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా మోడల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిపాసా బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో కరణ్‌తో ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు నడిపిస్తోంది. వీరిద్దరూ ఈనెల 30న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కి ఇది మూడో పెళ్లి కాగా, బిపాసా బసుకు మాత్రం మొదటి పెళ్లి . సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.