'సారీ బిపాసా.. నీ పెళ్లికి రాలేను' | I am away from Bipasha wedding, says Shilpa Shetty | Sakshi
Sakshi News home page

'సారీ బిపాసా.. నీ పెళ్లికి రాలేను'

Published Sat, Apr 30 2016 5:19 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

'సారీ బిపాసా.. నీ పెళ్లికి రాలేను'

'సారీ బిపాసా.. నీ పెళ్లికి రాలేను'

ముంబై: బాలీవుడ్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహాం నేటి సాయంత్రం జరగనున్న విసయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి తాను హాజరుకాలేను ఐయామ్ సారీ అంటూ స్నేహితురాలు, మరో నటి శిల్పాశెట్టి చెబుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన విషయాలపై నటి శిల్పాశెట్టి ట్వీట్ చేసింది. 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ప్రేమతో మెలగండీ, ఫ్రెండ్స్ లా ఉండాలని' ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. స్నేహితురాలి వివాహానికి హాజరుకాలేకపోతున్నందుకు కాస్త విచారం వ్యక్తంచేసింది. బిపాసా, కరణ్ ల వెడ్డింగ్ కార్డు కొన్ని రోజులుగా నెట్లో హల్ చల్ చేస్తోంది. నేడు వారిద్దరూ జీవిత భాగస్వాములు కానున్నారు.

ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా శనివారం నైరోబీకి వెళ్లాల్సి ఉందని పేర్కొంది. నిన్న జరిగిన మెహందీ కార్యక్రమంలో పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి.. తన భర్త, సోదరి దంపతులు, ఇతరులతో కలిసి పొల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా నూతన దంపతులు కానున్న కరణ్, బిపాసాలతో కలిసి ఫొటోలు దిగి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో బిపాసా, కరణ్‌ ల మధ్య ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ముంబైలో నేటి సాయంత్రం వారి వివాహం కొందరు బంధువులు, స్నేహితుల మధ్య జరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement