సాక్షి, న్యూఢిల్లీ : 'నువ్వు లేనిదే నేను లేను', 'నువ్వు కనిపించని మరుక్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది' అంటూ లెక్కలేనన్ని కవిత్వాలు వల్లించే ఎన్నో ప్రేమ జంటలు కూడా పెళ్లి తర్వాత విడిపోవడమో, కలహాలతోనే కాపురాలను లాగించడమో చేస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరోల ద్వారా కుదుర్చుకున్న పెళ్ళిళ్లు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పెళ్లికి ముందు సంసార జీవితానికి సంబంధించి ఒకరికొకరు ఇష్టాయిష్టాలతోపాటు అవసరాలను తెలుసుకోక పోవడం, వాటి పట్ల సరైన అవగాహనకు రాకపోవడమే ఈ దూరానికి, అనర్థాలకు కారణమని పెళ్లిళ్ల పేరయ్యలు అంటున్నారు. ఏ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా, కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నా సరే, కుటుంబ ఆర్థిక పరిస్థితులతోపాటు సంసార జీవితానికి సంబంధించి ఒకరికొకరు ఈ ప్రశ్నలు అడగాలని, వాటికి సంతప్తికరమైన సమాధానాలు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలంటూ కాలిఫోర్నియాకు చెందిన బి.ఎక్స్‌కెర్రీ పేరిట్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?)
1. విద్యార్హతలు ఏమిటి? చేస్తున్న ఉద్యోగం ఏంటీ? వస్తున్న జీతం ఎంత ? (ఇది అంత ముఖ్యం కాదు)
2. ఆస్తిపాస్తులెంత ? అప్పులెంత ? అప్పులుంటే వాటిని ఎలా, ఎవరు తీర్చాలి?
3. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇరువురు కలిసి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు పక్కా ప్రణాళిక వేసుకోవాలి!
4. లైంగిక పటుత్వం ఎంత ? సుఖ రోగాలేమైనా ఉన్నాయా? వైద్య పరీక్షలు జరిపించుకోవాలి.
5. వ్యక్తిగత ప్రైవసీ కోరుకుంటారా ? అది ఏ మేరకు?
6. ఎంత మంది పిల్లలు కావాలి ? లేదా దత్తత తీసుకునేందుకు సుముఖమేనా?
7. ఎలాంటి దుస్తులు, నగలంటే ఇష్టం ?
8. కరచాలనంతో ఇతరులను పలకరించడం ఇష్టమా లేక ఆలింగనంతో ఇతరులను పలకరించడం ఇష్టమా ?
9. కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తారు?
10. సంసార జీవితంలో చీటింగ్‌ను ఏ మేరకు భరించగలరు? అంటే గర్ల్ ఫ్రెండ్‌తోగానీ, భాయ్‌ఫ్రెండ్‌తోగానీ తిరగడం.
11. మతాల పట్ల పరస్పర అభిప్రాయాలు తెలుసుకోవాలి!
12. పరస్పర అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు అన్నింటికన్నా ముఖ్యమైనది ‘డైయింగ్ విష్’(చనిపోయేలోగా సాధించాల్సింది) ఏమిటో తెలుసుకోవడం.
ఈ ప్రశ్నలకు ఇరువైపులా సంతప్తికరమైన సమాధానాలు లభించినప్పుడే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే కాపురాలు నాలుగు కాలాలపాటు నిలబడతాయన్నది ఈ ట్విటర్ యూజర్ వాదన. ఆయన ట్వీట్‌కు లక్షల్లో లైక్‌లు రావడమే కాకుండా, రీట్వీట్లు కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలతో ఎక్కువ మంది ఏకీభవించగా, కొంత మంది మాత్రం విభేదించారు. మరికొందరు ఇవి చాలవన్నట్టు మరిన్ని ప్రశ్నలను చేర్చారు. మరి మీరేమంటారు...
చదవండి: వైరల్: బట్టలు చిరిగేలా కొట్టుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment