సవాల్ విసురుతున్న శిల్పాశెట్టి | Shilpa Shettys Motivational Post in social media | Sakshi
Sakshi News home page

సవాల్ విసురుతున్న శిల్పాశెట్టి

Published Sat, May 28 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

సవాల్ విసురుతున్న శిల్పాశెట్టి

సవాల్ విసురుతున్న శిల్పాశెట్టి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు సవాల్ విసిరింది. శనివారం తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ 'నేను సాధించాను, మరి మీరు' అంటూ కామెంట్ చేసింది. ఇంతకీ శిల్ప పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏంటీ అనుకుంటున్నారా..?

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన శిల్పా కేవలం కుటుంబ వ్యవహారాలతో పాటు బిజినెస్ పనులు మాత్రమే చూస్తూ గడిపేస్తోంది. ఇక కొడుకు పుట్టిన తరువాత ఫిజిక్ మెయిన్ టైన్ చేయడం కూడా పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ బాగా లావు పెరిగిపోయింది. అయితే ఈ మధ్య తన బాడీ మీద దృష్టి పెట్టి క్యాలరీలు కరిగించేసింది. అలా సన్నబడ్డ తన లుక్ ను గతంలో లావుగా ఉన్నప్పటి ఫోటోతో పాటు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది శిల్ప. ప్రస్తుతం తను సైజ్ 16 నుంచి సైజ్ 8కి మారినట్టుగా తెలుపుతోంది ఈ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement