
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్తబాస్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ బరువు తగ్గి ఆరోగ్యంగా ఉన్నారట. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ప్రకటించారు. మస్క్ స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారిన విషయాన్ని గమనించిన ఒక మహిళా ట్విటర్ యూజర్ ఇదే విషయాన్ని మస్క్‌ను అడిగారు. దీనికి స్పందించిన మస్క్ తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేశారు. కొన్ని నెలల్లోనే 30 పౌండ్స్ (13 కిలోలు) బరువు తగ్గినట్లు ప్రకటించడం విశేషంగా నిలుస్తోంది.(ElonMusk మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్)
కీలక ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన, ట్విటర్ బోర్డు రద్దుతోపాటు, వేలాదిమంది ఉద్యోగులపై వేటు, బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్, ఎక్కువ పనిగంటలు అంటూ ఉద్యోగులపై ఒత్తిడిలాంటి ఆరోపణల మధ్య నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. ఏకంగా 13 కేజీల బరువు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన నెటిజన్లు ఆయన ఆహార అలవాట్ల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారికి మస్క్ సమాధానమిస్తూ ఆహార నియమాలు కచ్చితంగా పాటించి బరువు తగ్గినట్లు తెలిపారు. మితంగా ఆహారం తీసుకోవడంతో పాటు, తనకెంతోఇష్టమైన ఆహారాల జోలికి వెళ్లలేదని తెలిపారు. అలాగే టైప్-2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నాననీ, ఇట్లా సిస్టమేటిగ్గా వెయిట్ తగ్గినట్టు చెప్పారు. ఇపుడు మరింత యాక్టివ్‌గా, హెల్దీగా ఉన్నానని మస్క్ వెల్లడించారు.
ఇదీ చదవండి: త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన
You’ve lost a ton of weight, Elon! Keep up the fantastic work! 💯💗 pic.twitter.com/uJhdxWUWqB
— ✨Chicago✨ (@chicago_glenn) November 16, 2022
ఆగస్టులో ఒక మంచి స్నేహితుడి సలహామేరకు ఉపవాసం ఉండటం తన ఆరోగ్యానికి మేలు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు తన స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌కి కారణమైన యాప్ పేరును వెల్లడించడం విశేషం. "జీరో ఫాస్టింగ్ యాప్ చాలా బాగుంది" అంటూ మస్క్ ట్వీట్ చేశారు.