Bipasha Basu-Karan Singh Grover
-
'సారీ బిపాసా.. నీ పెళ్లికి రాలేను'
ముంబై: బాలీవుడ్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహాం నేటి సాయంత్రం జరగనున్న విసయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి తాను హాజరుకాలేను ఐయామ్ సారీ అంటూ స్నేహితురాలు, మరో నటి శిల్పాశెట్టి చెబుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన విషయాలపై నటి శిల్పాశెట్టి ట్వీట్ చేసింది. 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ప్రేమతో మెలగండీ, ఫ్రెండ్స్ లా ఉండాలని' ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. స్నేహితురాలి వివాహానికి హాజరుకాలేకపోతున్నందుకు కాస్త విచారం వ్యక్తంచేసింది. బిపాసా, కరణ్ ల వెడ్డింగ్ కార్డు కొన్ని రోజులుగా నెట్లో హల్ చల్ చేస్తోంది. నేడు వారిద్దరూ జీవిత భాగస్వాములు కానున్నారు. ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా శనివారం నైరోబీకి వెళ్లాల్సి ఉందని పేర్కొంది. నిన్న జరిగిన మెహందీ కార్యక్రమంలో పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి.. తన భర్త, సోదరి దంపతులు, ఇతరులతో కలిసి పొల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా నూతన దంపతులు కానున్న కరణ్, బిపాసాలతో కలిసి ఫొటోలు దిగి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో బిపాసా, కరణ్ ల మధ్య ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ముంబైలో నేటి సాయంత్రం వారి వివాహం కొందరు బంధువులు, స్నేహితుల మధ్య జరగనుంది. Wishing @bipashabasu and Karan a happy married life, filled with trust, love and friendship -
వాళ్ల వెడ్డింగ్ కార్డ్ హల్ చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాంబ్ షెల్ భామ బిపాసా బసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ల వెడ్డింగ్ కార్డు నెట్లో చక్కర్లు కొడుతోంది. కరణ్ వీరాభిమాని ఒకరు ఈ పెళ్లికార్డును నెట్లో పోస్ట్ చేశారు. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసమ్ లుక్ లో అదిరిపోతున్న ఈ పెళ్లిపత్రికకు ఫ్యాన్స్ లైక్ లు, షేర్లు జోరుగా సాగుతున్నాయి. ఈమధ్య కాలంలో హల్ చల్ చేసిన పెళ్లివార్తలను ఇద్దరూ ధ్రువీకరించడంతో బీ టౌన్లో పెళ్లిసందడి షురూ అయింది. అందరితో శుభవార్త పంచుకునేందుకు సంతోషిస్తున్నామంటూ ఈ ప్రేమపక్షులు ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 30 తమ జీవితాల్లో విశేషమైన రోజని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు తమ వివాహం ఒక ప్రైవేట్ వ్యవహారమని, దయచేసి గోప్యతను గౌరవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా మోడల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిపాసా బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఎలోన్ సినిమా షూటింగ్ సమయంలో కరణ్‌తో ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లిపీటల వరకు నడిపిస్తోంది. వీరిద్దరూ ఈనెల 30న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కి ఇది మూడో పెళ్లి కాగా, బిపాసా బసుకు మాత్రం మొదటి పెళ్లి . సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.