Prakash Raj Gets Married Pony Verma Second Time, మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌! - Sakshi
Sakshi News home page

Prakash Raj Pony Verma: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌!

Aug 25 2021 1:18 AM | Updated on Aug 25 2021 4:27 PM

Prakash Raj Wedding Once Again Poni Varma - Sakshi

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని సందేహ పడుతున్నారా! అయితే మీ సందేహం నిజమే. అయితే ఈ పెళ్లి నిజమైనది కాదు ఉత్తుత్తిది మాత్రమే. ప్రకాశ్‌ రాజ్‌ కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు ఇలా చేసినట్టు ప్రకాశ్‌ రాజ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రకాశ్‌ రాజ్‌ భార్య పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోల్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ప్రకాశ్‌ రాజ్ పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు.

అయితే ప్రకాశ్‌ రాజ్‌ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని ప్రకాశ్‌ రాజ్‌ 2010లో వివాహం చేసుకున్న విషయం విదీతమే. కాగా  ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రకాశ్‌ రాజ్‌. అయితే ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ చేతికి చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement