కన్నీరు పెట్టిన ప్రియాంక! | Priyanka Chopra Tears Up At Joe Jonas Wedding In Paris | Sakshi
Sakshi News home page

కన్నీరు పెట్టిన ప్రియాంక!

Published Mon, Jul 1 2019 7:52 PM | Last Updated on Mon, Jul 1 2019 9:14 PM

Priyanka Chopra Tears Up At Joe Jonas Wedding In Paris - Sakshi

పారీస్‌ : బాలీవుడ్‌ అందాల భామ ప్రియాంక చోప్రా, భర్త  నిక్ జోనాస్‌ల ఫోటోలు తరచూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. ఆ జంట ఎక్కడి వెళ్లినా ఏదో ఒక రకంగా వారి ఫోటోలు నెట్టింట్లో తేలిపోతాయి. తాజాగా ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ మరో ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌, జోయ్‌ జొనాస్‌ వివాహం చేసుకున్న సందర్భంగా శనివారం ఫ్రాన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె భర్త నిక్‌ జొనాస్‌తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె పింక్‌ సారీలో దర్శనమిచ్చి అభిమానులను అలరించింది. నల్లని సూట్‌ ధరించి ఉన్న నిక్‌జొనాస్‌ పక్కన పింక్‌ సారీలో ప్రియాంక కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘ప్రియాంక కనీళ్లు పెట్టుకుంది’, ‘ప్రియాంకకు చెమటలు పట్టాయి.. ఫ్రాన్స్‌లో వేడి ఎక్కువగా ఉన్నట్లు ఉంది’, ఫ్రాన్స్‌లో ఎప్పుడూ వేడిగానే ఉంటుంది.. పాపం ప్రియాంక ఎండ ఎలా తట్టుకుందో’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తనను తాను సెల్ఫీ తీసుకుంటున్న ఫోటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Priyanka was crying 😭😭😭❤ #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement