
పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బిపాసా, కరణ్‌కు నిశ్చితార్థం అయిందని, ఏప్రిల్ 30న ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన బిపాసాను మీడియా ప్రతినిధులు పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. పెళ్లి ఎప్పుడు జరిగితే, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పింది. కాగా కరణ్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నాడు.