పిలువకున్నా పెళ్లికెళ్తానంటున్న బాయ్ ఫ్రెండ్!
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ల వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మరో 17 రోజుల్లో నా వివాహం అంటూ పేద్ద లవ్ కోట్ను కూడా బిపాసా గురువారం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక్క జాన్ అబ్రహంతో తప్ప తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇప్పటికీ మంచి రిలేషన్ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. ఈ వివాహా ఉత్సవానికి వీరిని ఆహ్వానించి కరణ్ మనసు నొప్పించాలనుకోవడంలేదట. అయినప్పటికీ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ డినో మోరియా మాత్రం పెళ్లికి వెళ్తానని మంకు పట్టు పడుతున్నాడు. బిప్స్ పిలువకపోయినా సరే వెళ్లి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు.
ఇక లాభం లేదనుకుందో ఏమో బిపాసానే డినోను ఆహ్వానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలకు వెళ్లడానికి డినో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ నందితా మెహతాని కూడా సిద్ధమౌతోందట. కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తన ఈ మూడో పెళ్లి వేడుకలకు అతని మాజీ భార్యలైన శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింజెట్లను ఆహ్వానించడం లేదటలెండి.