Dino Morea
-
అలాంటి పాత్రలు చేసి నిరాశ పర్చను: ఏజెంట్ విలన్
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈనెల 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో అందరి దృష్టి మాత్రం అతనిపైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారాయన. ఇంతకీ అతనేవరో తెలుసుకుందాం. డినో మోరియా గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఏజెంట్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ది గాడ్ అలియాస్ ధర్మ పాత్రలో అదరగొట్టారు. బాలీవుడ్‌లోనూ వెబ్ సిరీస్ ది ఎంపైర్‌లో ఆయన చివరిసారిగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డినో మోరియా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) డినో మోరియా మాట్లాడుతూ.."నిజం చెప్పాలంటే.. నేను ఇక్కడ ఏదో చేయాలని వచ్చా. నాకు బాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. నాకు వస్తున్న పాత్రలు నాకు నచ్చడం లేదు. ఒకవేళ వాటికి నేను ఒప్పుకుంటే నా అభిమానులు నిరాశకు గురవుతారు. 'ఏంటి నువ్వు ఇలాంటి పాత్రలు చేస్తున్నావా? అని ప్రశ్నిస్తారు. నా కెరీర్‌ని ఐదడుగులు వెనక్కు లాగే క్యారెక్టర్స్ కాకుండా.. ఒక్క అడుగు ముందుకు వేసే మంచి పాత్రలను ఎంచుకోవాలి. ఏజెంట్ మూవీ షూటింగ్‌పై తన అనుభవాలను పంచుకున్నారు. డినో మాట్లాడుతూ.. 'ఒమన్‌లో షూటింగ్ చాలా సవాళ్లతో కూడుకున్నది. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో 4 పొరల దుస్తులు ధరించి ఎండలో నటించా. ఆ సమయంలో తాము ఉడికిపోయినట్లు అనిపించింది. అయినా కూడా షూటింగ్ పూర్తి చేశాం. నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి సాహసోపేతమైన పాత్రతో తెలుగు అరంగేట్రం చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీలయ్యా.' అని వెల్లడించారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) కాగా.. డినో 1999లో ప్యార్ మే కభీ కభీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కందుకొండైన్ కందుకొండైన్, జూలీ, సోలోతో సౌత్ సినిమాల్లో నటించారు. ఏజెంట్ మూవీ షూటింగ్ బుడాపెస్ట్, హైదరాబాద్, ఒమన్‌లో జరిగింది. -
తెలుగు ఫ్యాన్స్ స్టార్స్ కోసం ప్రాణమిస్తారు, బాలీవుడ్లో ఏమీ ఉండదు!
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు డినో మోరియా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) మాజీ ఏజెంట్ ‘ది గాడ్’ పాత్ర చేశాను. సురేందర్ రెడ్డి ‘ఎంపైర్’ చూసి, నాకు ‘ఏజెంట్’కి చాన్స్ ఇచ్చారు. ప్రతి సీన్లోనూ నా నుంచి ఆయన మోర్ ఎనర్జీని కోరుకునేవారు. అయితే తెలుగు భాష రాకపోవడం నా బలహీనతగా అనిపించింది. ఇక తెలుగు ఫ్యాన్స్ తమ స్టార్స్ కోసం ప్రాణమిస్తారు. బాలీవుడ్లో ఇది అంతగా కనిపించదు. చిరంజీవి ఫ్యాన్స్ రామ్‌చరణ్‌ను, నాగార్జున ఫ్యాన్స్ అఖిల్‌ను అభిమానిస్తున్నారు. బాలీవుడ్లో నెపోటిజమ్ అంటే ఒప్పుకోను. నాది బెంగళూరు. బాలీవుడ్లో ఎవరూ తెలియకుండానే ముంబై వెళ్లి, అవకాశాలు తెచ్చుకుని ఇప్పుడు నటుడిగా మంచి స్థాయిలో ఉన్నాను’’ అన్నారు. -
బిపాషా బసు, డినో మోరియా ప్రేమ కథ తెలుసా?
బిపాషా బసు.. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ‘తెల్లరంగు’ అబ్సేషన్ను అవతలికి నెట్టిన నటి. డినో మోరియా... మోడల్స్ ర్యాంప్ మీదే కాదు తెర మీదా మెప్పించగలరని చూపించిన నటుడు. కలిసి ఉన్నా లేకపోయినా స్నేహితులుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి.. ఒకరికోసం ఒకరు నిలబడాలని నిరూపించిన జత ఇది. ప్రేమను విఫలం చేసుకున్న వ్యక్తులుగా చిత్రీకరించే కంటే మైత్రిని కాపాడుకున్న జంటగా వీళ్లను వర్ణించడం సబబు. బిపాషా ఫ్రమ్ కోల్‌కతా, డినో ఫ్రమ్ బెంగళూరు.. దాదాపు ఇద్దరూ ఒకేసారి ముంబై చేరారు మోడలింగ్ కోసం. కెరీర్ మొదటి నుంచీ ఈ ఇద్దరు మంచి స్నేహితులు. బాధనూ, సంతోషాన్నీ కలిసే పంచుకున్నారు. అరకొర అవకాశాలతో ఆర్థిక ఇబ్బందులు పడ్తున్నప్పుడు డబ్బు ఆదా చేయడం కోసం.. ముంబైలోని ‘జై హింద్ ’ హోటల్లో పది రూపాయలకే దొరికే తాలీనీ కలిసే తిన్నారు. ‘పది రూపాయల ఆ తాలీలో అన్నం నేను తింటే చపాతీలు డినో తినేవాడు. ఒక్కోసారి సంగం అన్నం, సగం రొట్టెలను పంచుకునే వాళ్లం. ఇలా ఒకటి, రెండు రోజులు కాదు కొన్ని నెలలు గడిపాం’ అంటుంది బిపాషా. కష్టసుఖాల్లో జంటగా చేసిన ఆ ప్రయాణమే వాళ్లిద్దరినీ ప్రేమికులుగా మార్చింది. 1997నాటి ఈ ముచ్చట అప్పటి పేజ్ త్రీకే కళను తెచ్చింది. ఏ పత్రికలోని ప్రేజ్ త్రీని తిరగేసినా... ఈ జంట ఫొటోలు.. ఆ ప్రేమ కబుర్లే. మోడలింగ్ ఫీల్డ్ ఈ ఇద్దరినీ ‘క్రేజీ కపుల్’గా పిలుచుకుంది. రాజ్... మోడలింగ్‌లో వస్తున్న పేరు, ప్రతిష్ఠలను ఆస్వాదిస్తూ బిపాషా ఆనందంగానే ఉంది. అంతకుమించి ఆశలు, లక్ష్యాలు ఏమీ పెట్టుకోదల్చుకోలేదు ఆమె. కానీ డినోనే అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అతని విషయంలోనే కాదు బిపాషా విషయంలోనూ. ‘నీ టాలెంట్‌ను మోడలింగ్‌కే పరిమితం చేయకు. సిల్వర్ స్క్రీన్ మీదా కనిపించాలి నువ్వు. సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయత్నించు. నేనూ ఆ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటన్నా’ అంటూ బిపాషాను ప్రోత్సహించాడు. అనుకున్నట్టుగానే ఆ ప్రయాణమూ కలిసే మొదలుపెట్టారు. అయితే బిపాషా తొలి సినిమా ‘అజ్నబీ’తోనే స్టార్డమ్ తెచ్చేసుకుంది. కాని డినో మోరియా స్ట్రగుల్ కొనసాగింది. ఇండస్ట్రీ తీరు తెన్నులను ఔపోసన పట్టి తగ్గట్టుగానే తనను తాను మలచుకుంది బిపాషా. వెండితెర వెలుగులో తన ప్రియ సఖి వెలిగిపోవడం డినోకు ఆనందాన్నిచ్చినా.. ఎందుకో తామిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు అతని మనసు గ్రహించింది. ఈ లోపే ఈ ఇద్దరూ కలిసి నటించే ఆపర్చునిటీ వచ్చింది. అదే ‘రాజ్’ మూవీ. సూపర్ హిట్ అయింది. సిల్వర్‌స్క్రీన్ మీదా వీళ్ల కెమిస్ట్రీకి తిరుగులేదని తేలింది. ‘రాజ్’తో బిపాషా ఇటు దర్శక, నిర్మాతలకే కాదు అటు హీరోలకు, అశేష ప్రేక్షక జనానికీ అభిమాన తార అయిపోయింది. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేనంత బిజీగా మారిపోయింది. అదే సినిమా డినోకూ అంతే పేరు సంపాదించి పెట్టినా అతను ఊహించినన్ని అవకాశాలను షెడ్యూల్ చేయలేకపోయింది. ఆ కారణం వలనో.. బిపాషా కూడా కెరీరే ముఖ్యంగా ప్రవర్తించడం వలనో ఏమో కాని.. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. వాళ్లు నిలబడ్డ ప్రేమ తీరంలోని ఇసుక జారిపోవడం మొదలైంది. ఇది 2002 నాటి సంగతి. ఏడేళ్ల వాళ్ల అనురాగం తెలియకుండానే కరిగిపోయింది. బ్రేకప్‌తో ఎండ్ అయిపోంది. ... అయినా ఆ ఇద్దరూ గొడవపడలేదు. ఆమె సక్సెస్‌ను చూసి అతను ఈర్ష్యపడలేదు. టాప్ హీరోల్లో ఒకడిగా లేనందుకు అతణ్ణి ఆమె చులకన చేయలేదు. ఆత్మీయుడిగానే భావించింది. అతనూ అంతే. ఇద్దరిలో ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు స్వాంతనగా నిలుస్తారు. ఒకరి అభిప్రాయాలను, నిర్ణయాలను మరొకరు గౌరవించుకుంటూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ. ‘మా ఇద్దరి ప్రేమ గతం.. ఫ్రెండ్షిప్ వర్తమానం. గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని సమస్యాత్మకంగా మలచుకోవడం మా ఇద్దరి నైజం కాదు. యవ్వనంలో జరిగిన అద్భుతం మా ప్రేమ. పరిణతి చేర్చిన గమ్యం ఇప్పటి మా స్నేహం. బిపాషా.. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. తను నన్నెప్పుడూ అత్యంత ఆప్తుల్లో ఒకడిగానే చూస్తుంది. నాకూ తను అంతే’ అంటాడు డినో మోరియా. - ఎస్సార్ -
పిలువకున్నా పెళ్లికెళ్తానంటున్న బాయ్ ఫ్రెండ్!
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ల వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మరో 17 రోజుల్లో నా వివాహం అంటూ పేద్ద లవ్ కోట్‌ను కూడా బిపాసా గురువారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక్క జాన్ అబ్రహంతో తప్ప తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇప్పటికీ మంచి రిలేషన్‌ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. ఈ వివాహా ఉత్సవానికి వీరిని ఆహ్వానించి కరణ్ మనసు నొప్పించాలనుకోవడంలేదట. అయినప్పటికీ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ డినో మోరియా మాత్రం పెళ్లికి వెళ్తానని మంకు పట్టు పడుతున్నాడు. బిప్స్ పిలువకపోయినా సరే వెళ్లి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుందో ఏమో బిపాసానే డినోను ఆహ్వానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలకు వెళ్లడానికి డినో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ నందితా మెహతాని కూడా సిద్ధమౌతోందట. కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తన ఈ మూడో పెళ్లి వేడుకలకు అతని మాజీ భార్యలైన శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింజెట్లను ఆహ్వానించడం లేదటలెండి. -
ఫుట్ బాల్ ఆడుతూ గాయపడ్డ హీరో
ముంబై: బాలీవుడ్ హీరో డినో మొరియా గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రంగా ఫుట్ బాల్ ఆడుతుండగా అతడి కాలికి గాయమైంది. త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని డినో మొరియా ట్విటర్ ద్వారా తెలిపాడు. కాలి గాయంతో విశ్రాంతి తీసుకోవాల్సి రావడం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల పాటు తాను నడవలేనని వెల్లడించాడు. తనను నడవనివ్వకుండా చేసిన ఫుట్ బాల్ ఆటను ఇప్పటికి ప్రేమిస్తున్నానని పేర్కొన్నాడు. తాను ఫిట్ గా ఉండడానికి కారణం ఫుట్ బాల్ ఆడడమేనని ట్వీట్ చేశాడు. తన కాలికి గాయమైన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాలికి కట్టుకుని కుర్చీపై పెట్టుకున్న ఫొటో పెట్టాడు. డినో మొరియా ఫొటోకు ఇన్ స్టాగ్రామ్ లో బోలెడు కామెంట్స్ వచ్చాయి. -
షటప్ అండ్ ట్రైన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన షారుక్