Agent Actor Dino Morea Interesting Comments On Telugu Audience - Sakshi
Sakshi News home page

Dino Morea: నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏజెంట్‌ నటుడు

Published Wed, Apr 26 2023 10:08 AM | Last Updated on Wed, Apr 26 2023 10:23 AM

Agent Actor Interesting Comments on Telugu Audience - Sakshi

అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్‌’. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన బాలీవుడ్‌ నటుడు డినో మోరియా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో  ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) మాజీ ఏజెంట్‌ ‘ది గాడ్‌’ పాత్ర చేశాను.  సురేందర్‌ రెడ్డి ‘ఎంపైర్‌’ చూసి, నాకు ‘ఏజెంట్‌’కి చాన్స్‌ ఇచ్చారు. ప్రతి సీన్‌లోనూ నా నుంచి ఆయన మోర్‌ ఎనర్జీని కోరుకునేవారు.

అయితే తెలుగు భాష రాకపోవడం నా బలహీనతగా అనిపించింది. ఇక తెలుగు ఫ్యాన్స్‌ తమ స్టార్స్‌ కోసం ప్రాణమిస్తారు. బాలీవుడ్‌లో ఇది అంతగా కనిపించదు. చిరంజీవి ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ను, నాగార్జున ఫ్యాన్స్‌ అఖిల్‌ను అభిమానిస్తున్నారు. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ అంటే ఒప్పుకోను. నాది బెంగళూరు. బాలీవుడ్‌లో ఎవరూ తెలియకుండానే ముంబై వెళ్లి, అవకాశాలు తెచ్చుకుని ఇప్పుడు నటుడిగా మంచి స్థాయిలో ఉన్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement