అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈనెల 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో అందరి దృష్టి మాత్రం అతనిపైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారాయన. ఇంతకీ అతనేవరో తెలుసుకుందాం.
డినో మోరియా గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఏజెంట్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ది గాడ్ అలియాస్ ధర్మ పాత్రలో అదరగొట్టారు. బాలీవుడ్‌లోనూ వెబ్ సిరీస్ ది ఎంపైర్‌లో ఆయన చివరిసారిగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డినో మోరియా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
(ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్)
డినో మోరియా మాట్లాడుతూ.."నిజం చెప్పాలంటే.. నేను ఇక్కడ ఏదో చేయాలని వచ్చా. నాకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. నాకు వస్తున్న పాత్రలు నాకు నచ్చడం లేదు. ఒకవేళ వాటికి నేను ఒప్పుకుంటే నా అభిమానులు నిరాశకు గురవుతారు. 'ఏంటి నువ్వు ఇలాంటి పాత్రలు చేస్తున్నావా? అని ప్రశ్నిస్తారు. నా కెరీర్‌ని ఐదడుగులు వెనక్కు లాగే క్యారెక్టర్స్ కాకుండా.. ఒక్క అడుగు ముందుకు వేసే మంచి పాత్రలను ఎంచుకోవాలి. ఏజెంట్ మూవీ షూటింగ్‌పై తన అనుభవాలను పంచుకున్నారు.
డినో మాట్లాడుతూ.. 'ఒమన్‌లో షూటింగ్ చాలా సవాళ్లతో కూడుకున్నది. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో 4 పొరల దుస్తులు ధరించి ఎండలో నటించా. ఆ సమయంలో తాము ఉడికిపోయినట్లు అనిపించింది. అయినా కూడా షూటింగ్ పూర్తి చేశాం. నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి సాహసోపేతమైన పాత్రతో తెలుగు అరంగేట్రం చేస్తున్నందుకు థ్రిల్‌గా ఫీలయ్యా.' అని వెల్లడించారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించారు.
(ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?)
కాగా.. డినో 1999లో ప్యార్ మే కభీ కభీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కందుకొండైన్ కందుకొండైన్, జూలీ, సోలోతో సౌత్ సినిమాల్లో నటించారు. ఏజెంట్ మూవీ షూటింగ్ బుడాపెస్ట్, హైదరాబాద్, ఒమన్‌లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment