అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్! | Bipasha basu dating with Karan Singh Grover | Sakshi
Sakshi News home page

అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!

Published Sun, Jul 19 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!

అమ్మడు డేటింగ్...అమ్మ ఫైరింగ్!

గాసిప్
జాన్ అబ్రహాంతో పదేళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత విడిపోయిన బిపాషా బసు ఇప్పుడు బుల్లితెర ఫేం కరణ్ సింగ్ గ్రోవర్‌తో ప్రేమ విహారాల్లో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కరణ్ సింగ్‌తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారామె. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఈ బంధం కూడా మూణ్ణాళ్ల  ముచ్చటేనని కొందరు జోక్‌లు వేసుకుంటున్నారు. కరణ్‌తో బిపాషా వ్యవహారం ఆమె తల్లికి ఏ మాత్రం రుచించట్లేదట. దీనికి కారణం లేకపోలేదు. కరణ్ సింగ్ ఇప్పటి వరకూ శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింగెట్‌లను పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బిపాషాతో ప్రేమను ఆస్వాదిస్తున్నారు కరణ్.  ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న కరణ్ సింగ్ గ్రోవర్‌తో కూతురు అంత చనువుగా ఉండటాన్ని బిపాషా తల్లి  ఏ మాత్రం సహించలేకపోతున్నారట. కూతురి మీద ఫైర్ అయ్యారని సమాచారం. దాంతో కరణ్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని, వేరే ఏమీ లేదని తల్లికి వివరణ ఇచ్చుకున్నారట బిపాషా. ఏదో తల్లిని కూల్ చేయడానికి అలా అని ఉంటుందని ఈ తల్లీ కూతుళ్లు గిల్లికజ్జాలు తెలిసినవాళ్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement