హనీమూన్‌: నా భార్య దేవత అంటున్న హీరో | Bipasha Basu, Karan Singh Grover honeymoon just got better | Sakshi
Sakshi News home page

హనీమూన్‌: నా భార్య దేవత అంటున్న హీరో

Published Wed, May 11 2016 3:13 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హనీమూన్‌: నా భార్య దేవత అంటున్న హీరో - Sakshi

హనీమూన్‌: నా భార్య దేవత అంటున్న హీరో

'నా భార్య దేవత' అంటూ బాలీవుడ్ నటి బిపాషా బస్సును ఆమె భర్త కరణ్‌సింగ్ గ్రోవర్‌ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ కొత్తజంట ఇప్పుడు హనీమూన్‌లో మునిగితేలుతోంది. అందమైన సముద్రతీరమైన మాల్దీవుల్లో తమ వైవాహిక జీవితపు తొలినాళ్లను ఎంజాయ్‌ చేస్తున్నది.

సముద్ర ఒడ్డున ఇసుకలో తమ హనీమూన్ సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో అప్‌డేట్‌ చేస్తున్నది ఈ జంట. తాజాగా కరణ్‌ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో భార్య బిపాషా ఫొటోను పెట్టి.. 'నా భార్య దేవత. నేను అదృష్టవంతుడిని కాక మరేమిటి' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిని రీపోస్టు చేసిన బిపాషా.. 'థాంక్యూ హాటీ.. బోథ్‌ గాట్ లక్కీ' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందమైన సముద్రం ఒడ్డున హనీమూన్‌లో సేదదీరుతున్న ఈ జంట తమ అనుభూతులకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పడు అభిమనులతో పంచుకుంటున్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement