రెస్టారెంట్‌లో రచ్చ.. రచ్చ... | Bipasha Basu fight at Restaurant | Sakshi

రెస్టారెంట్‌లో రచ్చ.. రచ్చ...

Published Thu, Dec 17 2015 3:40 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రెస్టారెంట్‌లో  రచ్చ.. రచ్చ... - Sakshi

రెస్టారెంట్‌లో రచ్చ.. రచ్చ...

ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న వార్తల్లో బిపాసా బసుకి సంబంధించిన వార్త ఒకటి. ఈవిడగారు ఓ రెస్టారెంట్‌లో చేసిన రచ్చ గురించి అందరూ చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే... తాజా ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి బిపాసా ఓ రెస్టారెంట్‌కి వెళ్లారట. అక్కడ లైట్‌గా మద్యం కూడా పుచ్చుకున్నారట.

ఆ మాత్రానికే బిపాసా నిషాతో గట్టి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారని బోగట్టా. కరణ్ సింగ్ గ్రోవర్ ఆమెను కంట్రోల్ చేయడానికి నానా పాట్లు పడ్డారని సమాచారం. ‘బిపాసా కంట్రోల్ యువర్ సెల్ఫ్’ అని వార్నింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. చేసేదేం లేక బిపాసాను అర్జంటుగా కరణ్ అక్కణ్ణుంచి తీసుకెళ్లారని చూసినవాళ్లు చెప్పుకుంటున్నారు. ఈ తతంగం ఆ నోటా ఈ నోటా వీర విహారం చేస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement