హనీమూన్‌: రాళ్లలో, ఇసుకల్లో.. | Bipasha Basu, Karan Singh Grover write their love in stone | Sakshi
Sakshi News home page

హనీమూన్‌: రాళ్లలో, ఇసుకల్లో..

Published Sat, May 14 2016 9:44 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హనీమూన్‌: రాళ్లలో, ఇసుకల్లో.. - Sakshi

హనీమూన్‌: రాళ్లలో, ఇసుకల్లో..

'రాళ్లలో ఇసకల్లో రాసాము ఇద్దరిపేర్లు.. కళ్ళు మూసి తిన్నగ కలిపి చదువుకో ఒక్కసారి' అని జాలీగా పడుకుంటూ హనీమూన్ ఎంజాయ్‌ చేస్తోంది బిపాసా బస్సు, కరణ్‌ సింగ్ గ్రోవర్‌ జంట. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట మాల్దీవుల్లో ప్రస్తుతం హనీమూన్‌లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

సముద్రం కెరటాల్లో, ఇసుక తిన్నెల్లో, సంధ్యసాయంత్రాల్లో హాయిహాయిగా గడిచిపోతున్న తమ హనీమూన్‌ గురించి ఎప్పటికప్పుడు ఈ కొత్త జంట సోషల్‌ మీడియాలో అప్‌డేట్ చేస్తోంది. ఆ ఫొటోలనూ పంచుకుంటోంది. వారి డ్రీమీ ఫొటోలు అభిమానుల్ని కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ జంట ఇసుకలో రాళ్లతో తమ పేరు రాసుకొని మురిసిపోయింది. నీలిసముద్ర తీరంలో తెల్లని గులకరాళ్లతో 'మంకీ లవ్ <3' అని రాసి ఆ వీడియోను తాజాగా బిపాసా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసింది.

ఇంతకు మంకీ అంటే తెలియదా? 'మంకీలవ్‌' హ్యాష్‌ట్యాగ్‌తోనే తమ పెళ్లిఫొటోలను ఈ జంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'మంకీ' అనేది ఈ జంట నిక్‌నేమ్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో బిపాసా అందమైన హనీమూన్‌ ఫొటోలను, హాట్ బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement