ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు.. | Bipasha Basu wife skills tested by fans and husband Karan Singh | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..

Published Fri, Jun 3 2016 6:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు.. - Sakshi

ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..

ముంబయి: ఇటీవల పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బాలీవుడ్ జోడీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఏప్రిల్ 30న బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల పాటు హనీమూన్ కు వెళ్లి, అక్కడ దిగిన ఫొటోలను నెట్ లో పెట్టి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాపులర్ కామెడీ ఈవెంట్ 'ద కపిల్ శర్మ షో' లో నూతన దంపతులు పాల్గొన్నారు. అయితే బిపాసకు సగటు భార్య చేసే పనులు ఏవైనా తెలుసా.. లేదా అని ఆడియన్స్ ఆమెకు పరీక్ష  పెట్టారు. వారితో పాటు భర్త కరణ్ కూడా ఆమెను కాస్త ఆటపట్టించాడు.

ఇంట్లో ఏమేం పనులు చేస్తారని అభిమానులు అడగగా వాటికి సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీ భర్త షర్ట్ కు ఎప్పుడైనా బటన్ కుట్టారా అని మరో ప్రశ్న సంధించారు. తన భర్తకే కాదు ఎవరి డ్రెస్ కు బటన్స్ కుట్టను. ఎందుకంటే స్టిచింద్ వర్క్ రాదని అసలు విషయాన్ని చెప్పింది. అభిమానుల ఇచ్చిన ఉత్సాహంతో బిపాసను కరణ్ కూడా టెస్ట్ చేశాడు. టై కట్టమని ఆర్డర్ వేయగా, బిపాస మొత్తానికి భర్తకు టై అడ్జస్ట్ చేసింది. భార్య టై కడుతున్నప్పుడు దర్జాగా హోదాలో ఉన్నట్లుగా ఫీలవుతూ కరణ్ కాసేపు నవ్వుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, భర్త బిపాసకు పరీక్ష పెట్టినట్లయింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఓ స్క్రీన్ మీద కనిపించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement