మూతి వాచి పోయింది! | Zarine Khan smooches co-actor with a swollen mouth | Sakshi
Sakshi News home page

మూతి వాచి పోయింది!

Published Thu, Aug 27 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

మూతి వాచి పోయింది!

మూతి వాచి పోయింది!

అయ్యో పాపం... ఎలా మ్యానేజ్ చేస్తుందో ఏంటో? అని ‘హేట్ స్టోరీ 3’ చిత్రబృందం జరీన్ ఖాన్‌ను చూసి తెగ జాలిపడిపోయింది. ఈ థ్రిల్లర్ మూవీలో జరీన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. కరణ్‌సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషీ కథానాయకులు. కరణ్, జరీన్ ఓ జంట కాగా, షర్మాన్ సరసన డైసీ షా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కరణ్, జరీన్ పాల్గొనగా ఓ ముద్దు సన్నివేశం చిత్రీకరించాలనుకున్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి జరీన్ జంకలేదు కానీ, ఆమె పెదవుల పరిస్థితే బాగాలేదట. పంటికి సంబంధించిన సమస్యకు చికిత్స చేయించుకున్న కారణంగా జరీన్ మూతి వాచిపోయింది.
 
 ఆ మూతితో ముద్దు సీన్ ఎలా చేస్తారో అని యూనిట్ సభ్యులు ఓ వైపు జాలిపడుతూనే, మరోవైపు ఆసక్తిగా తిలకించారట. ఈ పెదవి ముద్దు సీన్ తీస్తున్నప్పుడు ఆమె బాధతో విలవిల్లాడిపోయారట. ఆ బాధకు జరీన్ కళ్లు చెమర్చడం గమనించగానే చిత్ర దర్శకుడు విశాల్ పాండ్య కట్ చేప్పేశారట. జరీన్ కొంచెం తేరుకున్నాక మళ్లీ తీశారట. మొత్తం మీద కుర్రకారును గిలిగింతలు పెట్టే ఈ సీన్ చేయడానికి జరీన్ చాలా పాట్లు పడ్డారని సమాచారం. ఎలాగో సీన్ ముగించుకుని, హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారామె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement