Hate story 3
-
పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన
'బాలీవుడ్ అంతా పెద్ద తొండి.. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుంది. శృంగార సన్నివేశాల్లో పెద్ద స్టార్లు నటించినప్పుడు వారు బోల్డ్‌గా గొప్పగా నటించారంటూ ప్రశంసలు వస్తాయి. అదే చిన్న స్టార్లు, హీరోయిన్లు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. వారిదంతా 'వెగటు' ప్రదర్శన అంటూ కొట్టిపారేస్తారు' అంటూ జరీన్ ఖాన్ ఆవేదన చెందుతోంది. సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జరీన్ తాజాగా 'హేట్‌స్టోరీ-3'లో హాట్‌హాట్‌గా నటించింది. ఆ తర్వాత 'ప్యార్ మాంగా హై తుమ్సే' అనే వీడియో సాంగ్‌లో ఈ సుందరి దర్శనమిచ్చింది. అయితే కిషోర్ కుమార్ పాడిన క్లాసిక్ గీతంపై తీసిన ఈ వీడియో సాంగ్‌లో ఘాటైన శృంగార దృశ్యాలు ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరీన్ స్పందిస్తూ 'ఇలాంటి వాటి(బోల్డ్ సీన్ల)లో పెద్ద నటులు నటించి ఉంటే అవి అద్భుతంగా ఉన్నాయి. ఓ మై గాడ్ అంటూ ప్రశంసించేవారు. 'లుకింగ్ సో హాట్' అని కామెంట్ చేసేవారు. కానీ పెద్దగా పేరు, ప్రఖ్యాతలు లేని వారు తీయడంతోనే ఈ ఇదంతా చెత్త అని, వారిని తిడుతున్నారు' అని వ్యాఖ్యానించింది. -
'భగవాన్' స్థానంలో 'ఊపర్‌వాలా'..!
ఈ మధ్యకాలంలో పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బృందం కత్తెర బారిన పడని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నచిన్న విషయాలకే చాలా సినిమాలకు కత్తెర వేసినట్టు సెన్సార్ బోర్డు విమర్శలు ఎదుర్కొంటున్నది. తాజాగా 'హేట్‌స్టోరీ-3' సినిమా కూడా సెన్సార్ బోర్డు కత్తెర బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎరోటిక థ్రిల్లర్ అయిన ఈ సినిమా సహజంగానే 'ఏ' సర్టిఫికెట్ (పెద్దలకు మాత్రమే) కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో సినిమాకు కత్తెర పడబోదని చిత్రబృందం భావించింది. అయితే నిహలానీ నేత్వత్వంలోని కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) మాత్రం ఈ సినిమాను కూడా విడిచిపెట్టలేదని తెలుస్తున్నది. విశాల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన 'హేట్‌స్టోరీ-3'లో శర్మాన్ జోషీ, కరణ్‌సింగ్ గ్రోవర్, జరీనా ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పలుచోట్ల డైలాగ్‌లకు సెన్సార్‌బోర్డు మార్పులు సూచించినట్టు తెలిసింది. చిత్రంలోని ఓ సన్నివేశంలో శర్మాన్ జోషీ 'ఓ భగవాన్ కో మై జీత్నే నహీ దూంగా' అని అంటాడు. ఈ డైలాగ్‌లో 'భగవాన్' అన్న స్థానంలో 'ఊపర్‌వాలా' అనే పదాన్ని సెన్సార్‌బోర్డు సూచించింది. 'భగవాన్' పదంతో ఓ వర్గం ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందనే కారణంతో ఈ మేరకు మార్పులు చేయించింది. అదేవిధంగా టీజర్లో వినిపించే 'సంభోగ్' పదాన్ని తీయించి.. దాని స్థానంలో 'మిలన్' పదాన్ని చేర్చారు. ఇంకొన్ని డైలాగ్‌లు కూడా అభ్యంతరంగా ఉన్నాయంటూ మార్పులు సూచించారు. జేమ్స్‌బాండ్ సినిమా 'స్పెక్టర్'లో ముద్దు సీన్ నిడివిని సెన్సార్‌బోర్డు సగానికి తగ్గించడంపై వివాదం చెలరేగింది. అయినప్పటికీ 'హేట్‌స్టోరీ-3' సినిమాను శుద్ధిచేయడంలో సెన్సార్‌బోర్డు వెనుకంజ వేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
మూతి వాచి పోయింది!
అయ్యో పాపం... ఎలా మ్యానేజ్ చేస్తుందో ఏంటో? అని ‘హేట్ స్టోరీ 3’ చిత్రబృందం జరీన్ ఖాన్‌ను చూసి తెగ జాలిపడిపోయింది. ఈ థ్రిల్లర్ మూవీలో జరీన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. కరణ్‌సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషీ కథానాయకులు. కరణ్, జరీన్ ఓ జంట కాగా, షర్మాన్ సరసన డైసీ షా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కరణ్, జరీన్ పాల్గొనగా ఓ ముద్దు సన్నివేశం చిత్రీకరించాలనుకున్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి జరీన్ జంకలేదు కానీ, ఆమె పెదవుల పరిస్థితే బాగాలేదట. పంటికి సంబంధించిన సమస్యకు చికిత్స చేయించుకున్న కారణంగా జరీన్ మూతి వాచిపోయింది. ఆ మూతితో ముద్దు సీన్ ఎలా చేస్తారో అని యూనిట్ సభ్యులు ఓ వైపు జాలిపడుతూనే, మరోవైపు ఆసక్తిగా తిలకించారట. ఈ పెదవి ముద్దు సీన్ తీస్తున్నప్పుడు ఆమె బాధతో విలవిల్లాడిపోయారట. ఆ బాధకు జరీన్ కళ్లు చెమర్చడం గమనించగానే చిత్ర దర్శకుడు విశాల్ పాండ్య కట్ చేప్పేశారట. జరీన్ కొంచెం తేరుకున్నాక మళ్లీ తీశారట. మొత్తం మీద కుర్రకారును గిలిగింతలు పెట్టే ఈ సీన్ చేయడానికి జరీన్ చాలా పాట్లు పడ్డారని సమాచారం. ఎలాగో సీన్ ముగించుకుని, హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారామె. -
‘హేట్ స్టోరీ 3’కి నో
సీక్వెల్ సినివూలకు సైన్ చేస్తే పెద్దగా ఒరిగేదేమీ లేదంటోంది హాట్ మోడల్, బాలీవుడ్ భావు సోనాలీరౌత్. అందుకే తనను వెతుక్కొంటూ వచ్చిన హేట్ స్టోరీ 3 ఆఫర్‌ను వద్దు పొవ్ముంది. ‘ది ఎక్స్పోజ్’తో తెరంగేట్రం చేసిన ఈ సుందరి... సక్సెస్ సినివూల సీక్వెల్లో లీడ్ రోల్ చేయుడం సులభం కాదంటోంది. తనకంటూ గుర్తింపునిచ్చే విభిన్నమైన పాత్రలు చేయూలనేదే తన ఆకాంక్షంటూ చెబుతోంది. పిల్లలే పెళ్లి గౌన్ డిజైనర్లు హాలీవుడ్ సూపర్‌స్టార్ ఏంజిలినా జోలీ పెళ్లి గౌను ఆమె పిల్లలే డిజైన్ చేశారట! గత నెలాఖర్లో తన ప్రియుుడు బ్రాడ్ పిట్‌ను ఈ భావు పెళ్లాడి... ఏడేళ్ల వారి సుదీర్ఘ ప్రేమాయాణానికి శుభం కార్డు వేసింది. తన ఆరుగురు పిల్లలు కలసి పువ్వులు, కార్టూన్లు, డ్రారుుంగ్స్తో పెళ్లి గౌనును అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గౌనులో కనిపించిన జోలీ చూపరుల వుతి పోగొట్టేలా మెరిసిపోరుుందని ‘హలో వ్యూగజైన్’ కథనం. అంతేకాదు... వెడ్డింగ్ ప్లానర్స్ కూడా పిల్లలేనట. బరువు తగ్గితే బెటర్..! వరుస సినివూలు... యూడ్స్తో ఎంత బిజీగా ఉన్నా అందాల తార విద్యాబాలన్‌ను వెంటాడుతున్న సవుస్య ఆమె బరువు. కాస్త బొద్దుగా ఉన్నా ‘డర్టీ పిక్చర్’లో వేడెక్కించిన ఈ సొగసరి ఫిజిక్‌లో ఏదో తేడా కనిపిస్తుందన్నది బీ-టౌన్ గుసగుస. చీరలో కనిపించినంత అందంగా ‘కాక్టెరుుల్’ డ్రెస్సులు వేసుకొంటే ఉండదంటున్నారు. దర్శకుడు మోహిత్ సూరీ అరుుతే ఏకంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు... ‘విద్య బరువు తగ్గాలి’ అని. ఆమెతో అతను ‘హవూరీ అదూరీ కహానీ’ చిత్రం చేస్తున్నాడు.