పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన | Bold scenes of only big stars are praised, sasy Zareen Khan | Sakshi
Sakshi News home page

పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన

Published Mon, Aug 22 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన

పెద్ద స్టార్లకేనా ప్రశంసలు.. హీరోయిన్ ఆవేదన

'బాలీవుడ్ అంతా పెద్ద తొండి.. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుంది. శృంగార సన్నివేశాల్లో పెద్ద స్టార్లు నటించినప్పుడు వారు బోల్డ్‌గా గొప్పగా నటించారంటూ ప్రశంసలు వస్తాయి. అదే చిన్న స్టార్లు, హీరోయిన్లు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. వారిదంతా 'వెగటు' ప్రదర్శన అంటూ కొట్టిపారేస్తారు' అంటూ జరీన్ ఖాన్‌ ఆవేదన చెందుతోంది. సల్మాన్‌ ఖాన్‌ 'వీర్‌' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన జరీన్ తాజాగా 'హేట్‌స్టోరీ-3'లో హాట్‌హాట్‌గా నటించింది.

ఆ తర్వాత 'ప్యార్ మాంగా హై తుమ్సే' అనే వీడియో సాంగ్‌లో ఈ సుందరి దర్శనమిచ్చింది. అయితే కిషోర్‌ కుమార్ పాడిన క్లాసిక్ గీతంపై తీసిన ఈ వీడియో సాంగ్‌లో ఘాటైన శృంగార దృశ్యాలు ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరీన్ స్పందిస్తూ 'ఇలాంటి వాటి(బోల్డ్ సీన్ల)లో  పెద్ద నటులు నటించి ఉంటే అవి అద్భుతంగా ఉన్నాయి. ఓ మై గాడ్‌ అంటూ ప్రశంసించేవారు.  'లుకింగ్ సో హాట్‌' అని కామెంట్ చేసేవారు. కానీ పెద్దగా పేరు, ప్రఖ్యాతలు లేని వారు తీయడంతోనే ఈ ఇదంతా చెత్త అని, వారిని తిడుతున్నారు' అని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement